Advertisement

ఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరి

Oct 3 2020 @ 18:34PM

మనకున్న మేథమ్యాటికల్‌ సింబర్స్, ట్రాఫిక్‌ సింబల్స్.. ఎయిర్‌ పోర్ట్‌లో కస్టమ్స్‌కి, లగేజ్‌కి, రెస్ట్‌ రూమ్స్‌కి ఉండే సింబల్స్ ఫ్యూచర్‌ హ్యుమన్‌కి ఎలా అర్థమవుతాయ్?  రెండు పెగ్గులు వేస్తే.. మనకే రోడ్డు సిగ్నల్స్ అర్థం కావు. ఏది రెడ్డో, ఏది గ్రీనో.. తెలియడం లేదు. మరి ఫ్యూచర్‌ జనరేషన్స్‌కి ఏం అర్థం అవుతాయ్‌.. అందుకే ఫ్యూచర్‌ జనరేషన్స్‌తో కమ్యూనికేట్‌ చేయడం కోసం ఒక ఐడియా ఉందని తెలిపారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

 

''సేతి అని ఒక ఇనిస్టిట్యూట్‌ ఉంది. సెర్చింగ్‌ ఫర్ ఎక్సట్రా టెరిస్టిల్‌ ఇంటిలిజెన్స్. వేరే గ్రహాల్లో కూడా ప్రాణం ఉండే అవకాశం ఉంది కాబట్టి.. ఒకవేళ ఎప్పుడైనా ఎలియన్స్‌గానీ టచ్‌లోకి వస్తే.. వాళ్లతో ఎలా కమ్యూనికేట్‌ చేయాలి? అని చాలా సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు. ఎలియన్స్ కోసం చాలా మెసేజ్‌లు శాటిలైట్‌ ద్వారా పంపిస్తున్నారు.  వాళ్లు ఏ భాషలో మాట్లాడుతారో తెలియదు కాబట్టి.. అన్ని భాషల్లోనూ.. హలో అని, గుడ్‌ మార్నింగ్‌ అని మెసేజ్‌లు పంపుతున్నారు. అయితే నిజంగా ఆ ఎలియన్స్ టచ్‌లోకి వస్తే.. మనం కమ్యూనికేట్‌ చేయగలమా? అనేది పెద్ద ప్రశ్న. ఎలియన్స్ మరిచిపోండి. ఇక్కడి నుంచి ఒక 5 వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉండబోయే మనుషులతో మనం కమ్యూనికేట్‌ చేయగలమా? ఫ్యూచర్‌ హ్యుమన్స్‌తో మనమే, మన మానవజాతే కానీ.. మనం చెప్పేది వారికి అర్థం అవుతుందా అంటే.. ఇంపాజుబుల్‌. అనుక్షణం లాంగ్వేజ్‌ మారిపోతా ఉంది. మన నాలెడ్జ్‌ని వాళ్లు ఇంటర్యుపేట్‌ చేస్తారని గ్యారంటీ లేదు. అలాగే మనకి మేథమ్యాటికల్‌ సింబర్స్, ట్రాఫిక్‌ సింబల్స్, ఎయిర్‌ పోర్ట్‌లో కస్టమ్స్‌కి, లగేజ్‌కి, రెస్ట్‌ రూమ్స్‌కి సింబల్స్ ఉంటాయ్‌. అవి చూస్తే ఫ్యూచర్‌ హ్యుమన్‌కి ఎలా అర్థమవుతాయ్?  రెండు పెగ్గులు వేస్తే.. మనకే రోడ్డు సిగ్నల్స్ అర్థం కావు. ఏది రెడ్డో, ఏది గ్రీనో.. తెలియడం లేదు. అందుకే ఫ్యూచర్‌ జనరేషన్స్‌తో కమ్యూనికేట్‌ చేయడం కోసం ఒక ఐడియా ఉంది. సెమియోటిక్స్.  టు ఎనలైజ్‌ వెర్బల్‌ సైన్స్ అండ్‌ విజువల్‌ సైన్స్. 

మనం మాట్లాడే లాంగ్వేజ్‌, సింబల్స్ ఫ్యూచర్‌ హ్యుమన్స్‌కి మీనింగ్‌ లెస్‌లా అనిపిస్తాయ్‌. అలా అయిపోకుండా చేసే ప్రయత్నమే సెమియోటిక్స్. ప్రతి 250 సంవత్సాలకు ఒకసారి దీనిని అప్పుడున్న జనరేషన్‌ అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడున్న సింబల్స్, సిగ్నల్స్, ఎమోజీస్‌, లోగోస్‌, కరెంట్ కమ్యూనికేషన్‌ ఇలా సమాచారం దాచుకుంటూ.. అప్‌డేట్‌ చేసుకుంటూ వెళ్లాలి. అలా వెళితే 5 వేల సంవత్సరాల తర్వాత పుట్టిన వారికి మన గొడవేంటో కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది. ఏడు వేల సంవత్సరాల క్రితం ఇండియాలో రాతి యుగం. వాడు, మనం ఎదురెదురుగా కూర్చుంటే.. కోలాటం ఆడుకోవడం తప్ప.. మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. అంతెందుకు.. మనకంటే రెండు వేల సంవత్సరాల క్రితం మనిషితో గానీ, ఇక నుంచి రెండు వేల సంవత్సరాల తర్వాత మనిషితో గానీ,  మనం కమ్యూనికేట్‌ చేయలేం. భాషలు మారిపోతాయ్‌. రెలిజీయస్‌ మారిపోతాయ్‌. ఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు.  మనం నమ్ముకున్న ఫిలాసపీలుండవ్‌. మన డిఎన్‌ఏ మారిపోయి ఎవాల్వ్ అయిపోతామ్‌. మనుషులు పొట్టొ, పొడుగో అయిపోతారు. వేరే స్పీసెస్‌లాగా తయారైపోతాం. 2వేల సంవత్సరాల తర్వాత స్మశానంలో మన అస్థిపంజరం వాళ్లకి దొరికితే.. మనం వాళ్లకి ఏప్స్‌లా కనబడతాం. 

అంతేందుకు.. ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న మనిషిని తీసుకువచ్చి.. ఇప్పుడు విజయనగరంలో ఉన్నవాడి ముందు పెట్టండి. వాడు చెప్పేది వీడికి అర్థం కాదు, వీడు చెప్పేది వాడికి అర్థం కాదు. ఇద్దరూ విజయనగరం వాళ్లే.. ఇద్దరూ తెలుగే మాట్లాడతారు. కానీ ఒకరి తెలుగు ఒకరికి అర్థం కాదు. ఎందుకంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి స్లాంగ్‌ మారిపోతుంది. స్లాంగ్‌ వల్ల కొత్త పదాలు పుడతాయ్‌. పదాల వల్ల మీనింగ్‌ మారిపోతుంది. కాబట్టి.. మనం ఆహా.. ఓహో అనుకుంటున్న మన నమ్మకాలు కానీ, మన సిద్ధాంతాలు కానీ.. అన్ని గాలిలో కలిసిపోతాయి. అందుకని చిన్న చిన్న విషయాలకి బీపీ తెచ్చుకుని కోపంతో ఊగిపోవాల్సి అవసరం లేదు. ఫ్యూచర్‌ హ్యుమన్స్ వరకు ఎందుకు.. ఒకే ఇంట్లో మొగుడు చెప్పేది పెళ్లానికి అర్థం కావడం లేదు. పెళ్లాం చెప్పేది మొగుడికి అర్థం కావడం లేదు.. సెమియోటిక్సా.. నా బొందా!.." అని సెమియోటిక్స్ అనే టాపిక్‌ గురించి పూరీ తన పూరి మ్యూజింగ్స్‌లో తెలిపారు.ఇవి కూడా చదవండి :

పూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.