ఆరోజు నుంచి అప్పుడప్పుడు రాత్రిపూట.. వాళ్ల క్లాస్ బుక్స్ నేను చదివితే.. అవి విని పడుకునేవాళ్లు. తర్వాత వాళ్లిద్దరూ బిఏ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. నేను బిఎస్సీ ఫెయిల్ అయ్యాను. కాలేజ్ వదిలి వెళుతూ.. రైల్వేస్టేషన్లో అనౌన్స్మెంట్ జాబ్ కోసం అప్లై చేస్తామని చెప్పారు. సంతోషం అనిపించింది. మనకి కళ్లు ఉన్నాయనే పొగరుతో తాగి, తూలి నడుస్తాం. స్మెల్ చూడడం సరిగా తెలియదు. చెప్పేది వినడం రాదు. మనకి కళ్లు, ముక్కు ఏదీ పనిచేయవ్. కానీ వాళ్లకి అన్నీ సెన్స్లు పూర్తి స్థాయిలో పనిచేస్తాయ్. వాళ్లు ఏదైనా పట్టుకుంటే.. ఆ టచ్ వాళ్లకి జీవితాంతం గుర్తుంటుంది. మనందరి కంటే బ్లైండ్ పీపుల్‌కి కాన్ఫిడెన్స్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయ్. కళ్లు లేకపోయినా.. చాలా పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటారు. వాళ్లకున్న అలెర్ట్నెస్లో 10 శాతం కూడా మనకి ఉండదు. ఈ మధ్యే నేను ఒక కథ చదివా.." అంటూ.. బ్లైండ్ గురించి పూరి చెప్పుకొచ్చారు. ఆ కథేంటో, పూరి ఇంకా బ్లైండ్ గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే.. కింది వీడియో చూడాల్సిందే.