ఇండియాలో పబ్లిక్ మోర్ డేంజరస్ దెన్ పొలిటిషీయన్స్. ఓటు అడిగి చూడండి.. ఫుట్ బాల్ ఆడుకుంటారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనక కరప్షన్ ఉంది. వేసే ప్రతి ఓటు వెనక లంచం ఉంది.. అని అన్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో 'కరప్షన్' అనే టాపిక్‌పై మాట్లాడారు. కన్నతల్లి దగ్గరే లంచం తీసుకునే స్థాయి ఇప్పుడు బాగా పెరిగిపోయిందంటున్న పూరీ.. కరప్షన్ గురించి ఇంకా ఏం చెప్పారో తెలుసుకుందామా..
10 ఏళ్ళ కొడుకుతో తల్లి ఇలా అంటుంది.. నాన్న బయటికి వెళ్లి కూరగాయలు తీసుకురా.. అలాగే కిరాణా షాపుకు వెళ్లి ఈ సరుకులు తీసుకురా అంటుంది. అప్పుడు కొడుకు అంటాడు.. అమ్మా నాకు ఐస్‌క్రీమ్‌కి డబ్బులు ఇస్తే వెళతా. అలాగే నాన్న అంటుంది తల్లి. ఇంకో రోజు ఇంకో పని చెబితే.. పానీపూరికి డబ్బులిస్తేనే కానీ వెళ్లను అని కొడుకు మారాం చేస్తుంటాడు. వాడిని చూసి తల్లి మురిసిపోతూ.. ఏమిటో ప్రతిదానికీ వీడికి లంచమే అని నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఆ పిల్లాడే పెద్దాడే.. ఏదో ఒక ఆఫీసర్ అవుతాడు.. మనందరి సరదా తీర్చేస్తాడు. కరప్షన్‌కి పుట్టిన బిడ్డ వాడు. కన్నతల్లినే వదలలేదు.. నిన్ను నన్ను ఎందుకు వదులుతాడు. ఇలా మారాం చేసే పిల్లలతో ఈ ప్రపంచం నిండిపోయింది. పవర్ వల్ల ఎవడైనా కరప్ట్ అవుతాడు. పవర్‌ది తప్పుకాదు. ఆ పవర్ ఎవరి చేతుల్లో ఉన్నదీ అనేదే పాయింట్. అందుకే చిన్నప్పుడు మారాం చేసిన పిల్లలందరూ.. పవర్ కోసం లేదా పవర్ఫుల్ పొజిషన్ కోసం ట్రై చేస్తారు. మెల్లగా అలాంటి జాబులో జాయిన్ అవుతారు. పెద్ద పెద్ద పోస్టులు అవసరం లేదు. చెక్ పోస్ట్ దగ్గర స్టాంప్ వేసే పోస్ట్ దొరికితే చాలు. కుమ్మేస్తారు. ఎవరైనా పొలిటీషియన్ కరప్షన్ చేసి వేల కోట్లు నొక్కేశాడని తెలిస్తే.. కోపంతో ఊగిపోతాం. అలా ఊగిపోయే వాళ్లల్లో ఏ ఒక్కడినైనా తీసుకెళ్లి.. అదే పోస్ట్‌లో కూర్చోబెట్టి చూడండి. వాళ్లు అంతకంటే ఎక్కువ చేస్తారు. ఇండియాలో పబ్లిక్ మోర్ డేంజరస్ దెన్ పొలిటిషీయన్స్. ఓటు అడిగి చూడండి.. ఫుట్ బాల్ ఆడుకుంటారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనుక కరప్షన్ ఉంది. వేసే ప్రతి ఓటు వెనుక లంచం ఉంది.. '' అని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాధ్. ఇంకా కరప్షన్ గురించి ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.