''మీ అందరికీ ఈ-మెయిల్ ఐడీ లుంటాయ్. రోజూ మీ మెయిల్ బాక్స్‌లో వందల కొద్ది మెయిల్స్ వచ్చిపడుతుంటాయ్. అందులో 99 శాతం అవసరం లేనివే ఉంటాయ్. ఇలా వేల వేల ఈ మెయిల్స్ మీరు డిలీట్ చేయకపోవడం వలన.. మన ఇన్విరాన్మెంట్ దెబ్బతింటుందని చెబితే మీకు కోపాలు వస్తాయ్. దానికీ, దీనికి సంబంధం ఏమిటని?. మీ ఇన్ బాక్స్‌లో మెయిల్స్ ఉన్నాయంటే అర్థం.. ఎవరో ఎక్కడో స్టోర్ చేశారని అర్థం. మీ ఈమెయిల్స్ని మల్టీపుల్ సర్వర్స్‌లో ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టోర్ చేస్తారు. పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయ్. అవి హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కంజూమ్ చేస్తుంటాయ్. దాని వలన కార్బన్ ఇమిషన్స్ ఉంటాయ్. సంవత్సరానికి వరల్డ్ వైడ్ డేటా సెంటర్ పవర్ కన్జెమ్షన్ ఎంతో తెలుసా? రఫ్లీ.. 400 టెరావాట్స్. స్పామ్, అన్ వాంటెడ్ ఈమెయిల్స్ చెత్తని మనం దాస్తూ ఉంటాం. ఒక స్పామ్ ఈమెయిల్ వల్ల .3 గ్రామ్స్ కార్బన్ డయాక్సడ్ బయటికి వస్తది.
అందుకే ప్రతి రోజూ.. లేవగానే ఒక్కసారి, పడుకునే ముందు ఒక్కసారి స్పామ్ మొత్తం డిలీట్ చేయండి. ఇష్టంలేని వెబ్‌సైట్స్ ఉంటే బయటికి వచ్చేయండి. సోషల్ మీడియా వల్ల వచ్చే నోటిఫికేషన్స్ ఆపేయండి. రోజూ మీ ఇల్లు తుడవక పోయినా పరవాలేదు. స్నానం చేయకపోయినా పరవాలేదు. నీళ్లైనా మిగులుతాయ్. దయచేసి అన్వాంటెడ్ మెయిల్స్ అన్నింటిని డిలీట్ చేసేయండి. ఇదే చేస్తే.. మీరు గ్లోబల్ వార్మింగ్‌కు హెల్ప్ చేసిన వారు అవుతారు.." అంటూ పూరీ ఈ-మెయిల్స్ గురించి చెప్పుకొచ్చారు.