Advertisement

జ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరింది

Oct 5 2020 @ 20:25PM

ఎన్‌లైటెన్‌మెంట్ అంటే పెద్ద అచివ్‌మెంట్‌ అనుకోవద్దు. ఇట్స్‌ యాన్‌ అండర్‌స్టాండింగ్‌.. కామన్‌సెన్స్. దానికోసం మనం తపస్సు చేయాల్సిన పనిలేదు అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన ఎన్‌లైటెన్‌మెంట్ అనే టాపిక్‌ మీద మాట్లాడారు. బైబిల్‌లో, భగవద్గీతలో లేనివి కూడా ఈవాళ అందరికీ తెలిసిపోతున్నాయి.. దానికోసం సాధువులే అవ్వాల్సిన పనిలేదని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

 

"చిన్నప్పుడు చందమామ కథ చదివా. సడెన్‌గా ఒకడికి వైరాగ్యం వచ్చింది. రాగానే వాడు హిమాలయాలకు పోయాడు. పాతికేళ్లు సాధువులతో కలిసి బతికాడు. సాధన చేశాడు. ఎన్‌లైటెన్‌మెంట్ (జ్ఞానోదయం) వచ్చింది. ఎన్‌లైటెన్‌మెంట్ వస్తే ఇంట్లో కూర్చోలేం కదా.. ఎవడికన్నా చెప్పాలి. సరే తన జ్ఞానాన్ని తన ఊళ్లో అందరికీ పంచడానికి తిరిగి తన ఊరు వెళ్లాడు. ఊరి చివర ఒక కసాయి వాడు ఓ గొర్రెను టపక్‌న నరికి కీమా చేస్తాడు. సాధువు కంగారు పడి వాడిని ఆపి చెబుతాడు. 'నాయనా.. ఈ జన్మలో నువ్వు గొర్రెను చంపేస్తే.. వచ్చే జన్మలో ఆ గొర్రె మనిషై పుడుతుంది. నువ్వు గొర్రెలా పుడతావ్‌. అప్పుడు అతను నిన్ను కూడా ఇలాగే నరికేస్తాడు.. ఇది సైకిల్‌.. పెద్ద సైకిల్‌ నాన్నా..' అని చెబుతాడు. 

అప్పుడు ఆ కసాయి వాడు ఆ సాధువు వంక చూసి.. 'వీడు పోయిన జన్మలో నన్ను నరికేశాడయ్యా.. అందుకే నేను ఇప్పుడు వాడిని నరుకుతున్నా.. నువ్వు చెప్పింది కరెక్టే.. ఇది పెద్ద సైకిలే..' అని చెప్పి కీమా కొడుతున్నాడు. ఆ సమాధానం విని సాధువుకి మతిపోయింది. ఇంత చిన్న విషయం నాకు ఎందుకు తెలియలేదు? అని. ఈ రోజుల్లో సాధువుకే కాదు.. చదువుకోలేని పల్లెటూరి వాడికి కూడా చాలా తెలుసు. ఎన్‌లైటెన్‌మెంట్ అంటే పెద్ద అచివ్‌మెంట్‌ అనుకోవద్దు. ఇట్స్‌ యాన్‌ అండర్‌స్టాండింగ్‌.. కామన్‌సెన్స్. దానికోసం మనం తపస్సు చేయాల్సిన పనిలేదు. తెలియని ఫిలాసపీ అంటూ ఏమీలేదు. బైబిల్‌లో, భగవద్గీతలో రాయనివి కూడా ఈవాళ అందరికీ తెలుసు. ఎన్‌లైటెన్‌మెంట్ వచ్చిన వాళ్లందరూ సాధువులే కానక్కరలేదు. పెళ్లి అయ్యి.. కాపురాలు చేస్తూ.. మన చుట్టూ చాలా మంది ఉన్నారు.  ఎన్‌లైటెన్‌మెంట్ ఈజ్‌ కామన్‌సెన్స్.." అని పూరి ఎన్‌లైటెన్‌మెంట్  గురించి చెప్పుకొచ్చారు.ఇవి కూడా చదవండి :

అత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.