Advertisement

పూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది

Oct 2 2020 @ 19:49PM

పని పాటా లేకుండా ఉన్నవారికి లేదా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నవాళ్లకి డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ ఓ కథ చెప్పారు. ‘స్వామీజీ’అంటూ ఆయన చెప్పిన కథ అదిరిపోయింది. తప్పనిసరిగా ఈ కథను ఒక వ్రతంలాగా పైన పూరి చెప్పిన వాళ్లు ఆచరించాలని ఆయన కోరారు. పూరీ మ్యూజింగ్స్ ఆయన ‘స్వామీజీ’ అనే టాపిక్‌ మీద మాట్లాడారు. ఇక పూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ ఏమిటో తెలుసుకుందామా?

 

"కౌశల దేశంలో ఒక ఊరి చివర అడవిలో ఒక స్వామీజీ ఉండేవాడు.  ఆయన మహా జ్ఞాని. ఆయన గొప్పతనానికి ముగ్ధులై .. ఊరిలోని అందరూ ఆయనకి ఆశ్రమం కట్టారు. ఆయన ఒక్కరే అక్కడ ఉండేవారు. అప్పుడప్పుడు అందరూ వచ్చి.. ఆయన చెప్పేది విని వెళ్లిపోయేవారు.  ఆయనకి రోజూ ఉదయం ఒక్క అరటిపండు మాత్రమే తినే అలవాటు.  ఆ అరటిపండు దేవుడి దగ్గర పెట్టి.. పూజ అవ్వగానే బట్టలు మార్చుకుని వచ్చేసరికి.. ఆ ఒక్క అరటిపండుని.. ఒక ఎలుక తినేసింది. స్వామీజీవారికి కోపమెచ్చింది. ఇలా ప్రతిరోజు ఆ అరటిపండుని ఎలుక తినేయడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీవారికి సహనం నశించింది. దానిని ఎలాగైనా చంపడం కోసం.. ఒక పిల్లిని పెంచుదాం.. అనే ఆలోచన వచ్చింది. స్వామీజీవారి కోరిక మేరకు ఊరిలోని వారు ఒక పిల్లిని అక్కడ వదిలేశారు. మరి పిల్లికి పాలు ఎలా? స్వామీజీవారికి ఒక ఆవు ఉంటే మంచిది అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఊరి వారు ఆవును తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. అలాగే ఆ ఆవును చూసుకోవడానికి బాబ్జీ అనే కుర్రాడిని కూడా పెట్టారు. ఈ ఎలుక మాత్రం ఇంకా దొరకడం లేదు. 

ఒక రోజు ఆవును చూసుకునే బాబ్జీకి జ్వరం వచ్చింది. మరి ఆవుకి గడ్డి ఎవరు వేస్తారు? పేడ ఎవరు తీస్తారు? పాపం స్వామీజీ ఇబ్బంది పడకూడదని.. ఊరిలోని వారు.. బాబ్జీ వాళ్ల అక్కని పంపించారు.  వాడి అక్క పేరు మోహిని. చక్కని పిల్ల.  పైగా వయసులో ఉంది. ఒక వర్షం కురిసిన పగలు, ఆవును కట్టేసి, తడిసిన పైట పిండుకుంటుంది మోహిని. ఆ దృశ్యం స్వామీజీ చూశాడు. మనసు చలించింది. మెల్లగా మోహినినీ లోపలకు లాగారు. మ్యూజిక్‌ మొదలైంది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు వాళ్ల తమ్ముడికి జ్వరం వచ్చినా, రాకపోయినా..   మోహిని మాత్రం ఆశ్రమానికి వస్తూ, పోతూ.. రహస్యంగా స్వామీజీ వారికి సేవలు చేసుకునేది. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నెలతప్పడంతో.. ఊరిలో అందరికీ ఈ సేవల గురించి తెలిసిపోయింది. కోపంతో మోహిని తండ్రి వచ్చి.. స్వామీజీ గడ్డం పట్టుకుని ఆశ్రమంలో నుంచి బయటికి లాగాడు. అందరూ వచ్చి పెద్ద గొడవ చేసి.. ఆ పిల్లను స్వామీజీకిచ్చి అదే రాత్రి పెళ్లి చేసేశారు. శోభనం రాత్రి ఈ బాజ్జీగాడు ఆశ్రమం బోర్డ్ పీకేశాడు. నాలుగు రోజుల తర్వాత మోహిని, వాళ్ల అమ్మ, నాన్న, తమ్ముడు బాజ్జీ ఆశ్రమానికి షిఫ్ట్ అయిపోయి.. అందరూ అక్కడే ఉంటూ.. పక్కనే ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ.. స్వామీజీని పెద్దకాపుని చేసేశారు. ఆ తర్వాత మోహిని కడుపున పండంటి కొడుకు పుడితే.. వాడికి వీరినాయుడు అని పేరు పెట్టారు. అలా స్వామీజీ కూడా మనలాగే సంసారంలో పడి ****పోయాడు. ఇది కథ. 

మోరల్‌ ఏమిటంటే.. ఏ కష్టం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే మన ఇగో లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు వచ్చేస్తాయ్‌. అలాంటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన కొంపలు ముంచేస్తాయ్‌. అసలు ఎలుక అరటిపండు తింటే తప్పేముంది.  అది కూడా ప్రాణే కదా. ఒకటి అరటిపండు కాకపోతే రెండు పెట్టు పూజలో. ఇద్దరూ చెరొకటి తింటే అయిపోతుంది. దానికి కోపం. ఆ అనవసరపు కోపం వల్ల.. తెలియకుండా మన ట్రైయిన్‌ వేరే పట్టాలు ఎక్కేస్తుంది.  చాలా దూరం వెళ్లాక కానీ తెలియదు.. ఎటు వెళ్దాం అనుకున్నాం.. ఎటు పోయాం అనేది. ఇన్ని దరిద్రాలకు కారణం ఒక ఎలుక అనే విషయం మనకి తెలియను కూడా తెలియదు. ఈ కథ ఎవరికోసం అంటే.. పని పాటా లేకుండా ఉన్నవారికి లేదా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నవాళ్లకి.. మీరందరూ తప్పనిసరిగా ఈ కథని తప్పకుండా వినాలి. వినడమే కాదు..  ఒక వ్రతం లాగా 10 మందితో ఈ కథని పంచుకోవాలి. ఫార్వార్డ్ చేసుకోవాలి.." అని పూరి స్వామిజీల గురించి చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి :

‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]jyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.