"సినిమా మారాలి. నెక్స్ట్ ఇయర్ నుండి సినిమా మారాలి. రీజనల్ అనే సంగతిని మరచిపోండి. సౌత్, నార్త్ లేదు. కంటెంట్ ఈజ్ కింగ్. వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఓటీటీలు రెడీగా ఉన్నాయి. రైటర్స్ నిద్రపోతే ఇండస్ట్రీ నిద్రపోతుంది" అని అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా "లోకల్ ఈజ్ గ్లోబెల్" అనే అంశం గురించి పూరీ మాట్లాడుతూ "మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు. అన్నీ వెబ్ సిరీస్ ఫ్లాట్‌ఫామ్స్‌లో మనం చూడలేనంత ఓటీటీ కంటెంట్ ఉంది. అయినా సరే! ఏదైనా మంచి కథ ఉంటే రెకమెండ్ చేయమని ఫ్రెండ్స్‌ను అడుగుతుంటాం. ఏదైనా నచ్చకపోతే వెంటనే మార్చేస్తాం. ఏ మాత్రం స్టాండర్డ్స్ తగ్గినా తట్టుకోలేకపోతున్నాం. కానీ ఏమాత్రం మంచిది చూస్తే మాత్రం అందరం చూస్తున్నాం. మనమే కాదు. ప్రపంచమంతా చూస్తుంది. నార్కోస్, మనీ హైస్ట్ వంటి సిరీస్‌లను అన్నీ దేశాలు చూసేశాయి. నిజానికి వాటిని స్పానిష్ లాంగ్వేజ్‌లో షూట్ చేశారు. మనకు భాష రాకపోయినా, సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూసేశాం. అంటే కంటెంట్ బావుంటే, ప్రపంచమంతా చూడటానికి రెడీగా ఉంది. ఇవాళున్న పరిస్థితుల్లో లోకల్ ఈజ్ గ్లోబల్. లోకల్ కంటెంట్ బావుంటే లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. ఇక నుండి ప్రాంతీయతను దృష్టిలో పెట్టుకుని తీయకూడదు. ప్రపంచమంతా నా సినిమాను చూడబోతుందనుకుని తీయాలి. మనం స్టాండర్డ్ ఉన్న సినిమాలు తీస్తే చూడటానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు చూడటానికి రెడీగా ఉన్నాయి. కొన్ని వెబ్ సిరీస్‌లైతే సినిమాల కంటే బావున్నాయి. రైటింగ్ మరో లెవల్లో ఉంది. యాక్టర్స్ ఇరదీస్తున్నారు. మేకింగ్ కంప్లీట్‌గా మారిపోయింది. ఇక్కడ నుండి మన సినిమా మారిపోవాలి. నువ్వు మాస్ సినిమా తీసినా గ్లోబెల్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చెయ్. కోటి రూపాయల్లో చిన్న సినిమా తీసినా నేషన్ అంతా నా సినిమాను చూస్తారని నమ్మి తీయాలి. రోజులు మారాయి. కథ చెప్సి కన్విన్స్ చేయాల్సిన వాళ్లు రోజూ హాలీవుడ్ కంటెంట్ చూస్తున్నారు. మనం ఆ రేంజ్లో లేకపోతే కన్విన్స్ చేయలేం. పబ్లిక్ కూడా అంతే. బీసీ సెంటర్స్‌లోని ఆడియెన్స్ డబ్బింగ్ చేయకపోయినా చైనీస్, కొరియన్ సినిమాలు చూసేస్తున్నారు. యంగ్ రైటర్స్ రావాలి. నువ్వు రైటర్‌వి అయితే నిద్రపోవద్దు. నీ మీదే అందరూ డిపెండ్ అయ్యున్నారు. ప్రొడ్యూసర్స్ డబ్బులు చేతుల్లో పట్టుకుని ఎదురుచూస్తున్నారు. కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. మన దగ్గరే కంటెంట్ లేదు. స్పీడు పెంచుదాం. స్టాండర్డ్స్ మార్చుదాం. లోకల్ సినిమాను ప్రపంచానికి చూపిద్దాం. లోకల్ ఈజ్ గ్లోబెల్" అన్నారు.