Advertisement

వీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్

Sep 18 2020 @ 14:05PM

`పూరీ మ్యూజింగ్స్` పేరుతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్  వివిధ అంశాలపై తన ఆలోచనలను  సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా ద్వీపం (ఐలాండ్) గురించి మాట్లాడారు.



`నాకో చిన్న కోరిక ఉంది. మనుషులు లేని ద్వీపంలో ఓ కుక్కతో కలిసి కనీసం ఓ నెలరోజులైనా ఒంటరిగా ఉండాలి. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ ఉండకూడదు. ఓ చిన్న గుడిసె వేసుకుని కుక్క పక్కన పడుక్కోవాలి. అడవిలో జంతువుల్లా ఉండాలి. వర్షం వచ్చినప్పుడు తడవాలి. 40 ఏళ్లకు పైగా ఒంటరిగా బతికిన వాళ్లు నాకు తెలుసు. మాల్దీవులు వెళ్లినపుడు ఈ ఐడియా గుర్తుకు వచ్చింది. 24 గంటలపాటు ప్రయత్నించా. చుట్టూ సముద్రం.. మధ్యలో అర ఎకరా నేల.. అందులో నేను` అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. 


 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.