Advertisement

ఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్

Oct 9 2020 @ 13:40PM

`పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `సంగీతం` గురించి మాట్లాడారు. సంగీతం లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించలేమని, సంగీతాన్ని కనిపెట్టి మనిషి గొప్ప పని చేశాడని పేర్కొన్నారు. 


`ఒకే ఒక్క విషయంలో నాకు మనిషి నచ్చుతాడు. వీడు సంగీతాన్ని కనిపెట్టాడు. ఏ జంతువూ చేయలని పని వీడు చేశాడు. ప్రపంచంలో ఎన్నో రకాలైన సంగీతాలు ఉన్నాయి. అన్నింటికంటే దమ్మున్న సంగీతం ఇండియన్ క్లాసికల్. హిందుస్థానీ, కర్ణాటిక్ కలిసి మొత్తం 4 లక్షల రాగాలున్నాయి. అందులో మనకు 70, 72 రాగాలు మాత్రమే తెలుసు. అవే సినిమాల్లో వింటుంటాం. పాటలు లేకుండా మనం బతకలేం. సంగీతానికి చాలా పవర్ ఉంది. ప్రస్తుతం పలు రకాల యాప్‌ల ద్వారా ప్రపంచంలోని మొత్తం సంగీతం మీ ముందుంది. వినే మనసు ఉండాలే కాని అనంతమైన సంగీతం ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు మనకు ట్యూన్ మాత్రమే తెలుస్తుంది. బ్రేకప్ అయ్యాక లిరిక్స్ పూర్తిగా అర్థమవుతాయి. వీలైనంత సేపు సంగీతం వినండి. సంగీతం వింటున్నప్పుడు మీ శరీరంలో డోపమైన్, ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా మీ శరరంలో చాలా నొప్పులు సంగీతం వల్ల తగ్గుతాయి. మ్యూజిక్ అంటే ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు. స్నేహం చెయ్యొద్దు. కనీసం మాట్లాడొద్ద`ని పూరీ పేర్కొన్నారు. 


 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.