ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వివిధ ఆంశాలపై తన అభిప్రాయాలను `పూరీ మ్యూజింగ్స్` పేరుతో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా స్పానిష్ ఫుడ్ `పయాయ` గురించి మాట్లాడారు. దాని టేస్ట్ గురించి, దాని తయారీ విధానం గురించి వివరించారు.
`నాకు చాలా ఇష్టమైన ఆహారాల్లో ఒకటి పయాయ. స్పెయిన్ వెళితే నేను మొదట తినే ఆహారం ఇదే. ఇది స్పెయిన్ నేషనల్ డిష్. దీనిని మొదట వెలంటియాలో మొదలు పెట్టారు. రైతులు తినే ఆహారం ఇది. చాలా పురాతనమైన ఆహారం. పయాయ అంటే వేయించే పెనం అని అర్థం. దీని కోసం ఓ ప్రత్యేకమైన పెనం వాడతారు. దానిలోనే వండుతారు. చాలా పలచగా ఉంటుంది. అలాగే ఓ ప్రత్యేకమైన రైస్ వాడతారు. దాని పేరు బొంబా. కచ్చితంగా దీనితోనే వండాలి` అంటూ పయాయలోని రకాలు, దాని తయారీలో వాడే పదార్థాల గురించి వెల్లడించారు.