‘‘2050 నాటికి ఈ ప్రపంచం ఎంత అడ్వాన్సుగా ఉండబోతుందో ఊహించుకుంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ప్రపంచమంతా చాలా మార్పులు జరుగుతాయి’’అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా పూరి 2050 గురించి మాట్లాడారు. ‘‘ డ్రైవర్లు లేని కార్లు వస్తాయి. కృతిమ మేథస్సు మరో లెవల్లో ఉంటుంది. ప్రతి ఇంట్లో స్మార్ట్ రోబోలుంటాయి. మన పనులని చక్కగా అవే చేసేస్తుంటాయి. ప్రపంచంలో ఇంటర్నెట్ ఫ్రీ అవుతాయి. పిలిస్తే మన మొబైల్లోని సిరి, అలెక్సాలు మన ముందు హాలోగ్రాములవుతారు. వాళ్లతో కలిసి సొఫాలో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. స్టెమ్ సెల్స్ ప్రాసెస్ సక్సెస్ అయ్యి, ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అయిపోతుంది. అందరం ఇంకా యంగ్‌గా కనిపిస్తాం.
దీనికి మరో వైపు.. ఇప్పుడున్న జనాభా మూడురెట్లు అవుతుంది. సిటీలన్నీ కలిపి ప్రపంచ ఎనర్జీని మూడు వంతులు వాడేస్తుంది. దీనికి మూడు రెట్లు కార్బన్ ఎమిషన్ ఉంటుంది. దీని వల్ల ఎయిర్ గట్టిపడి పీల్చడం కష్టమవుతుంది. దీనికోసం ఎయిర్ప్యూరిఫై మాస్కులను పెట్టుకుని తిరుగుతాం. కాఫింగ్, అస్తమా, ఎంఫసీమా పుష్కలంగా ఉంటాయి. ఆడవాళ్ల ఆరోగ్యం దెబ్బతిని బిలియన్స్ ప్రీ మెచ్యూర్డ్ చావులుంటాయి. ఇంటర్నేషనల్ ఓటర్ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం 40 శాతం మందికి తాగడానికి నీరుండదు’’ అన్నారు. సదరు పూరి మ్యూజింగ్ ఆడియో ఫైల్ మీకోసం....