''ఆడాళ్లు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ల ప్రశ్నలన్నీ లాజికల్‌గా ఉంటాయి. ఈ మగ వెధవలకు ఆన్సర్స్ లేక, ఏం చెప్పాలో తెలియక పెళ్లాల మీద చేయి చేసుకుంటారు" అని అంటున్నారు పూరీ జగన్నాథ్. తాజాగా పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన గ్రహాంతర వాసులు(ఏలియన్స్) అనే అంశం గురించి మాట్లాడారు. "ఒక బుక్ ఉంది. అందులో మగవారు అంగారక గ్రహానికి, స్త్రీలు శుక్ర గ్రహానికి చెందినవారు అని రాసి ఉంది. అది నిజం. ఆడాళ్లు, మగాళ్లు ఒక జాతి కాదు. రెండు గ్రహాలకు చెందినవారు. వాళ్లకి మనం, మనకి వాళ్లు గ్రహాంతరవాసులే. మనం ఏలియన్స్తోనే లవ్‌లో పడ్డాం. వాటినే పెళ్లి చేసుకున్నాం. మగ ఏలియన్స్‌కి, ఆడ ఏలియన్స్‌కు భావాలు రాత్రిపూట ఏదో గంటసేపు కలుస్తాయే తప్ప, తెల్లవారితే పూర్తి విరుద్ధంగా ఉంటాయి. సంబధమే ఉండదు. ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే మగాడు సైలెంట్ అయిపోతాడు. ఇంట్లో చెప్పడు. వాడిలో వాడే కుళ్లిపోతుంటాడు. ఆడాళ్లు అలా కాదు. వాళ్లు చక్కగా మాట్లాడుతారు. సమస్య వస్తే ఇంట్లో అందరూ కూర్చోవాలి. అందరి ఓపినియన్స్ తీసుకోవాలి. ఆమెకు కాలుద్ది. గొడవలైపోతాయి. ఆడాళ్లు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ల ప్రశ్నలన్నీ లాజికల్‌గా ఉంటాయి. ఈ మగ వెధవలకు ఆన్సర్స్ లేక, ఏం చెప్పాలో తెలియక పెళ్లాల మీద చేయి చేసుకుంటారు. అలా చేయద్దు. దయచేసి, మీ భార్యలకు గౌరవం ఇవ్వండి. వాదన సమయాల్లో మగ ఏలియన్స్ ఎగ్రెసివ్‌గా ఉంటాయి. తప్పుడు భాషను వాడుతాయి. మీ ఎలియన్ను గౌరవించండి. ఇష్టం ఉన్నా, లేకపోయినా వాళ్లు చెప్పినట్లు చచ్చినట్లు వినండి. మనం తాళి కట్టింది ఏలియన్‌కి. రోజంతా అందరి దగ్గర అన్నీ భరించి వస్తావు. ఇక్కడ నీకెందుకు అంత పౌరుషం. భార్య చెప్పింది విను. ఏలియన్స్ తాటతీస్తాయి" అన్నారు పూరీ జగన్నాథ్.