డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనకు తెలిసిన విషయాలపై అందరిలో అవగాహన పెంచడానికి పూరీ మ్యూజింగ్స్ పేరిట ఆడియో ఫైల్స్‌ను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పూరీ మ్యూజింగ్స్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే పలు అంశాలపై మాట్లాడిన పూరీ జగన్నాథ్ తాజాగా మొబైల్ 'యాప్స్' గురించి మాట్లాడారు. "చాలా మంది కొత్త యాప్స్ ఏమైనా ఉంటే చెప్పమని అంటున్నారు. ఎయిర్ బీఎన్బీ యాప్‌తో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో వెయ్యి రూపాయలకు కూడా రూము దొరుకుతుంది. విదేశాల్లో మేం రూం రెంట్ భరించలేం అని అనుకున్నప్పుడు కౌచ్ సర్ఫింగ్ యాప్ ద్వారా చాలా మంది మీకు వాళ్లింలో ఓ రూమ్కానీ, కౌచ్గానీ ఫ్రీగా ఇస్తారు. కూల్ కజిన్ అనే యాప్ ఉంది. దీని ద్వారా విదేశాల్లో మనకు కజిన్స్ ఉంటే ఎలా హెల్ప్ చేస్తారో అలా మనకు హెల్ప్ చేయడానికి వస్తారు. ఎయిర్‌పోర్టులకు కూడా వచ్చి మనల్ని రిసీవ్ కూడా చేసుకుంటారు. బాబిల్, రెసోర్టా స్టోన్ వంటి యాప్స్ ద్వారా విదేశీ భాషలను నేర్చుకోవచ్చు" అంటూ మనకు ఉపయోగపడే పలు యాప్స్ గురించి పూరీ తన 'యాప్స్' మ్యూజింగ్‌లో వివరించారు. ఆ మ్యూజింగ్ మీకోసం....