"హిమాలయాల దగ్గరలోని హిమాచల్‌లో స్పితి అనే చిన్న ఊరుంది. అక్కడ వెయ్యేళ్ల ముందు కట్టిన బుద్ధుని గుడి ఉంది. చాలా మంది టూరిస్టులు దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. రాతిపలకలు అమ్ముతారక్కడ. మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుని ఆ రాతిపలకపై మీ పేరు ఉలితో చెక్కి అక్కడ పెడితే మీ కోరిక తీరుద్ది" అని అంటున్నారు పూరీ జగన్నాథ్. పలు అంశాలపై పూరీ మ్యూజింగ్స్‌లో వివరిస్తున్న పూరీ జగన్నాథ్ తాజాగా 'బుద్ధ' అనే అంశంపై మాట్లాడారు. ఆయన ఇంకా మాట్లాడుతూ "రెండు అడుగుల రాతిపలకపై స్పితిలో మీ పేరు అందంగా చెక్కడానికి శిల్పులు కూడా ఉన్నారు. మీ పేరున్న పలకను అక్కడ పెట్టేసి వెళ్లిపోవడమే పని. అలా ఆ గుడి మొత్తం రాతి పలకతో నిండిపోయింది. టెంపుల్ ఎక్కడో ఉంటే పలకలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అన్ని పలకలు అక్కడున్నాయి. పలకల విషయం పక్కన పెట్టి బుద్ధుని గురించి ఆలోచిస్తాం. ఆశే అన్ని దరిద్రాలకు మూలం ఆశను వదిలేయండని బుద్ధుడు గొంతు చించుకుని అరిచి అరిచి చచ్చిపోయాడు. కానీ మనం ఏం చేస్తున్నాం" అని విమర్శనాత్మకంగా మాట్లాడుతున్న 'పూరీ మ్యూజింగ్ బుద్ధ' మీకోసం...