Advertisement

కాఫీని కరెక్ట్‌గా వాడితే...

Sep 23 2020 @ 14:18PM

కాఫీని కరెక్ట్‌గా వాడితే మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చునని అంటున్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌. పూరి మ్యూజింగ్స్‌లో తాజాగా పూరి.. కాఫీ అనే టాపిక్‌ గురించి మాట్లాడారు. అసలు కాఫీ ఎలా... ఎక్కడ పుట్టింది? మన ఇండియాలోకి కాఫీని ఎవరు తీసుకొచ్చారు?  అనే విషయాలతో పాటు కాఫీ వల్ల బెనిఫిట్స్‌ను పూరి వివరించారు. అది ఆయన మాటల్లోనే వినేద్దాం..

"ఇథియోపియాలో 11వ శతాబ్దంలో ఓ మేకల కాపరి కొండెక్కాడు. అక్కడ చెర్రీల్లాంటి పళ్లను తిని మేకలు డాన్స్‌ చేయడం మొదలెట్టాయి. రోజూ ఆ డాన్సులు చేయడం చూసి ఆ మొక్కమీద కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడు. వేడి నీళ్లలో ఆ పిక్కలను వేసి తాగాడు. ఏదో తెలియని ఆనందం, అద్భుతం అనిపించింది. అదే కాఫీ. ఆ మేకల కాపరి ఇచ్చిన కాపరి వాడ్ని అందరూ దేవుడిలా చూసేవారట. వాడొక బాబాల, చిన్నసైజు జీసస్‌ క్రైస్‌లా తయారయ్యాడు. ఎందుకంటే వాడి దగ్గరకు చాలా మంది సన్యాసులు కూడా వచ్చి కాఫీ తాగేవారు. ఆ ప్లేస్‌ పేరు కఫా. అందుకే అది కాఫీ అయ్యింది. తర్వాత కాఫీ వ్యవసాయం స్టార్ట్‌ అయ్యింది. మెల్లగా యెమన్‌, ఇస్తాంబుల్‌, వెన్నిస్‌, పారిస్‌, హాలెండ్‌, లండన్‌ ఇలా అన్నీ దేశాలకు వెళ్లింది. మన దేశానికి కాఫీని పరిచయం చేసింది అరబ్స్‌. ఇదే కాఫీ ఇటలీ వెళ్లి రకరకాలుగా మారింది. హాట్‌ వాటర్‌ స్ప్రేతో బీన్స్‌ నుండి తీసిన కాఫీని ఎస్‌ప్రెస్సో అంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రా కాఫీ అది. ఇందులో కొంచెం పాలు వేస్తే మకీయాతో, దాంట్లో వేడి చేసిన పాలు కలిపితే ల్యాతె, దాంట్లో చాక్లెట్‌ పౌడర్‌ కలిపితే క్యాపచినో, ఎస్‌ప్రెస్సో, హాట్‌ చాక్లెట్‌, స్టీమ్డ్‌ మిల్క్‌ కలిపితే అదే ముకా, కొర్రెత్తో, అమెరికాన్‌, డోపియో ... ఇలా ఎన్నెన్నో కాఫీలు తయారయ్యాయి. 


 

ఇన్‌స్టెంట్‌ కాఫీ, బ్రూ కాఫీ, ఉడిపి హోటల్లో కాఫీ ఒకలా ఉంటుంది. చెన్నైలో కాఫీ ఒకలా ఉంటుంది. ఇంట్లో మన అమ్మ పెట్టిన కాఫీ ఇంకా బావుంటుంది. ఇప్పుడు లేవగానే కాఫీ ఇవ్వడం లేటయితే గొడవలైపోయేదాకా వచ్చాం. బేసిక్‌గా కాఫీ చాలా మంచిది. చాలా ఉపయోగాలున్నాయి. శారీరక సామర్థ్యం పెరుగుతుంది. బరువు తగ్గుతాం, మన ఒంట్లో కొవ్వు కరుగుతుంది. మన ఫోకస్‌ పెరుగుతుంది. ఇది కాకుండా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే వర్కవుట్‌ ముందు చిన్న ఎస్‌ప్రెస్సో తాగండి ఎక్సైజ్‌ కుమ్మేస్తారు. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి కాఫీ తాగుతూ, పాత పాటలు వింటే ఆదో ఆనందం. కాఫీ ప్లే లిస్టులు కూడా ఉన్నాయి. కాఫీ తాగుతూ వినాల్సిన ఇటాలియన్‌ ప్లే లిస్టులు, ఐరిష్‌ కాఫీ ప్లే లిస్టులున్నాయి. మంచి కాఫీ తాగి మన రోజును ప్రారంభించొచ్చు. ఆ గుడ్‌ ఫీలింగ్‌ వల్ల మనకు మంచి ఆలోచనలు కూడా వస్తాయి. కాఫీని కరెక్ట్‌గా వాడితే మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. ముందు మీరు అర్జంటుగా కాఫీ ప్లే లిస్టు డౌన్‌లోడ్‌ చేయండి. ఆ పాటలు వింటూ మీరు నెక్ట్స్‌ కాఫీ తాగాలి. లైఫ్ ఎంజాయ్‌ చేయడం నేర్చుకోవాలే కానీ.. కాకా హోటల్లో కాఫీ కూడా బావుంటుంది" అన్నారు పూరీ జగన్నాథ్‌. ఇవి కూడా చదవండి :

నేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరివైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.