మనకు మన వంశంలో మన తండ్రి తర్వాత తాత, అంతకు మించి మన ముత్తాత పేరు తెలుసుండొచ్చు. కానీ అంతకు మించి తెలుసుకోవాలని చాలా మందికి ఉన్నా కూడా అదెలా అనేది తెలియదు. కానీ.. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ ఉందని అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. కొన్నిరోజులుగా ఈ డాషింగ్ డైరెక్టర్ 'పూరీ మ్యూజింగ్స్' అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి..జెని 2.0 (డీఎన్ఏ టెస్ట్) గురించి మాట్లాడుతూ...
"నేనెవర్ని, ఎక్కడ్నుంచి వచ్చానని తెలుసుకోవాలనే ఆసక్తి మీకుంటే.. మీకొక గుడ్ న్యూస్ చెబుతా, నేషనల్ జాగ్రఫీ ఛానెల్ జీ నాన్సి టెస్ట్ అని ఓ టెస్ట్ చేస్తున్నారు. మనం డబ్బుల కడితే వాళ్లొక కిట్ పంపిస్తారు. అందులో ఓ ఇయర బడ్లాంటిది ఉంటుంది. అందులో మన సలైవా నింపి వాళ్లకు పంపిస్తే వాళ్లు మన డీఎన్ఏతో అన్సిస్ట్రీ టెస్ట్ చేస్తారు. ఈ గ్రేట్ గ్రాండ్ రిలేటివ్స్ ఎవరో తెలుసుకోవచ్చు. మనలోని భౌతిక లక్షణాలు మొటిమొలుండొచ్చు, రింగుల వెంట్రుకులుండొచ్చు. అలా ఎందుకొచ్చిందో తెలుసుకోవచ్చు. అలాగే మీలోని వ్యాధ్యులు అల్జీమర్స, పార్కిన్సెస్ వంటి వాటికి కారణాలు తెలుస్తాయి. వాళ్ల దగ్గర జెనో టైప్ అనే టెక్నిక్ ఉంటుంది. డీఎన్‌లో మనుషులకు సంబంధించి మూడు బిలియన్స్ బేస్ పెయిర్స్ ఉంటాయి. వాళ్లదగ్గర డీఎన్ఏ రిలేటివ్స్ టూల్ అని ఒకటుంది. దాన్ని బట్టి మీ పూర్వీకులు ఎవరు? అని తెలుసుకోవచ్చు. అబ్రహం లింకన మీకు చుట్టం కావచ్చు. క్లియోపాత్ర మీ అక్క కావచ్చు. చెంగిజ్‌ఖాన్ రక్తం మీలో ఇంకా ఉండొచ్చు. అందులో గత 500వ సంవత్సరాల్లో మీ పూర్వీకులెవరు? ఇంకా లోతుగా వెళితే వలసవాదులుగా మన పూర్వీకులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు. ఇలా వాళ్లు మనకు సంబంధించి74 రిపోర్ట్స్ ఇస్తారు. ఈ టెస్ట్ పేరు 'జీన్ 2.0'. ఈ టెస్ట్ ఖరీదు 150 డాలర్లుంటుంది. నేను నా టెస్ట్ చేయించుకున్న నాకు చాలా విషయాలు తెలిశాయి. మీరు కూడా అలాంటి టెస్ట్ చేయించుకోవాలంటే అలాంటి టెస్ట్ చేయించుకోండి" అన్నారు.