"ఈ ప్రపంచం ఓ పెద్ద పుస్తకం. నువ్వు మీ ఊళ్లోనే పుట్టి అక్కడే చస్తే నీకు ఒక పేజీ మాత్రమే తెలుసని అర్థం. వీలైనన్ని పేజీలు తిరగేయండి" అని అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ట్రావెలింగ్ అనే అంశంపై పూరి మాట్లాడుతూ "ట్రావెలింగ్ చేయడం చాలా గొప్ప విషయం. మీరేం చేస్తున్నారని చెప్పాలంటే నేనొక ట్రావెలర్ అని చెప్పాలనుంటుంది. కొలంబస్, వాస్కోడిగామా, హుయాన్‌త్సాంగ్ లాగా వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలనుంటుంది. అన్నీ దేశాలు తిరగాలనుంది. కానీ సంసార సాగరంలో ఇరుక్కున్నాం కాబట్టి కుదరదు. అయినా పర్లేదు వీలైనంత తిరిగేద్దాం. ప్రతి ఏడాది ఏదో ఒక దేశానికి వెళ్లండి. ఆ కిక్కే వేరు. గ్రూపుతో వెళ్లి గైడు వెనకాల తిరిగేవాడ్ని టూరిస్ట్ అంటారు. అలాకాకుండా సపరేట్గా వెళ్లేవారిని ట్రావెలర్స్ అంటారు. ఈ రెండు కాకుండా ఎక్స్‌ప్లోరర్స్ ఉంటారు. ఎక్స్‌ప్లోరర్ కావాలంటే ధైర్యముండాలి. ఒంటరిగా ఉండాలి. నేను చాలా మంచి ఎక్స్ప్లోరర్స్ను కలిశాను. రూపాయి ఖర్చు లేకుండా స్పెయిన్ నుండి కేవలం వెహికల్స్‌ను లిఫ్ట్ అడుక్కుంటూ 12దేశాలు దాటి ఇండియా వచ్చిన ఓ జంట తెలుసు. లండన్ నుండి హిమాచల్ కొండల్లో మైనస్ డిగ్రీల చలిలో నెలల తరబడి స్లీపింగ్ బ్యాగులో పడుకునే డేవిడ్ తెలుసు. హిమాలయ పర్వతం ఎక్కి నిలబడ్డ ఇరవైయేళ్ల కుర్రాడు తెలుసు. అతి తక్కువ ఖర్చుతో ఎలా ట్రావెల్ చేయాలో ఓసారి గూగుల్ చేయండి. వీలైతే ఒంటిరిగా ట్రావెల్ చేయండి. ఎలాంటి ప్లాన్ లేకుండా చేసే ప్రయాణం ఓ ఎక్స్‌పెరియెన్స్" అని అంటున్న పూరీ మ్యూజింగ్ మీ కోసం....