''1952లో రాజస్థాన్‌లో కుర్రాడు పుట్టాడు. తల్లిదండ్రులు అతనికి రవీంద్ర కౌషిక్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి అతనికి నటుడవ్వాలని కోరిక. 20 యేళ్ళ వయసులో ఉత్తరప్రదేశ్‌లో ఓ నాటకం వేసే అవకాశం వచ్చింది. రవీంద్ర చాలా అందగాడు. ఆ నాటకం వేస్తున్నప్పుడు ఒక రా ఆఫీసర్ అతనిని చూశాడు. రవీంద్ర నటన, వ్యాకరణం నచ్చి.. ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. రవీంద్రతో మాట్లాడి ఒకటి రెండు ఇంటర్వ్యూల తర్వాత రా తరపున ఒక గూఢచారిగా అతనిని అపాయింట్ చేశాడు. అతనికి పంజాబీ, పాకిస్థానీ ఉర్దూ నేర్పి ముస్లింలా మార్చడం మొదలుపెట్టాడు. 23 యేళ్ళ వయసులో రవీంద్రకి నబీ అహ్మద్ షకీల్‌గా పేరు మార్చి సీక్రెట్‌గా పాకిస్థాన్‌లో వదిలేశాడు. రవీంద్ర అక్కడ ముస్లింలా పెరుగుతూ.. లా కాలేజీలో ఎల్ఎల్బి చేసి మెల్లగా పాకిస్థాన్ ఆర్మీలో మేజర్ జాబ్ సంపాదించాడు. అందరూ అతనిని పాకిస్థానీ బోర్న్ ముస్లిం అనుకున్నారు. బేసిక్‌గా తను యాక్టర్ అవ్వడం వల్ల.. అది కెరీర్‌కి ఎంతో హెల్ప్ అయ్యింది. ఎవరికీ అనుమానం రాకుండా అమానత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి ఎంతో వేల్యూబుల్ ఇన్ఫర్మేషన్ని ఇండియాకు పంపించడం మొదలుపెట్టాడు. 1979 నుంచి 1983 వరకు అతను పంపించిన సమాచారం ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ చాలా హెల్ప్ అయింది. రా ఏజన్సీలో అతనిని బ్లాక్ టైగర్ అని పిలిచేవారు.. '' అని బ్లాక్ టైగర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు పూరి. ఆ వివరాలు తెలియాలంటే క్రింది వీడియో చూడాల్సిందే.