నిజమైన మనిషికి క్యారెక్టర్ ఉండదు. నాకు తెలుసు అయ్యగారు.. మీరు మాటిస్తే అంతే. ప్రాణం అయినా వదులుకుంటారుగానీ.. మాట తప్పరు మహాప్రభో.. అని కొందరు మిమ్మల్ని ఒక క్యారెక్టర్‌కి ఫిక్స్ చేయడానికి చూస్తుంటారు. నీతో కబడ్డీ ఆడుకుంటూ ఉంటారు. అలాంటి వారే ఒక ఫ్రేమ్‌లో నిన్ను బంధించి గోడకి మేకు వేసి కొట్టేస్తారని చెప్పుకొచ్చారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో క్యారెక్టర్ అనే టాపిక్ మీద మాట్లాడారు. ఇంకా ఆయన ఈ క్యారెక్టర్ గురించి ఏం చెప్పారో.. తెలుసుకుందామా..
''ఒక్కో మనిషికి ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది. వాడికి కొన్ని అభిరుచులు, బిహేవియర్, డ్రస్సింగ్ స్టైల్, మాట్లాడే విధానం, రియాక్ట్ అయ్యే విధానం.. ఇలా అన్నీ కలిసి అతని క్యారెక్టర్ అవుతుంది. ఆ లక్షణాలన్నీ కన్సిస్టెంట్గా అతను మెయింటైన్ చేస్తే.. అతని క్యారెక్టర్ ఏమిటో అందరూ చెప్పగలరు. అలా కన్సిస్టెంట్గా ఉండే వాడంటేనే సొసైటీకి ఇష్టం. ఎందుకంటే వాడిని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. వాడు ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పేయవచ్చు. అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉంటే వాడికి క్యారెక్టర్ లేదురా.. అంటారు. 'నాకు తెలుసు అయ్యగారు.. మీరు మాటిస్తే అంతే. ప్రాణం అయినా వదులుకుంటారుగానీ.. మాట తప్పరు మహాప్రభో..' అంటాడు ఒకడు. అంటే నీ క్యారెక్టర్ని ఫిక్స్ చేసి.. అలాగే చేయమని నీకు గుర్తు చేస్తూ.. నిన్ను వీపీని చేసి నీతో ఆడుకుంటున్నాడు. ఇలాంటి మాటలు వింటూ.. వాళ్ల కోసం అదే క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ బతికావో.. నిన్ను కబడ్డీ ఆడుకుంటారు. ఎందుకంటే నీకు కోపం వస్తే ఏం చేస్తావో వాళ్లకి తెలుసు. నీకు ఆనందం వస్తే ఏం చేస్తావో.. వాళ్లకి తెలుసు. అందుకే అందరూ నీ క్యారెక్టర్ని వర్ణిస్తూ.. ఆ వర్ణనతో ఒక ఫ్రేమ్ కట్టి.. అందులో పెట్టి.. గోడకి మేకు వేసి కొడతారు. నిజమైన మనిషికి క్యారెక్టర్ ఉండదు..." అని పూరీ తెలిపారు. ఇంకా ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే.. కింది వీడియో చూడాల్సిందే.