Advertisement

అన్‌ హ్యాపీగా ఉండేవాళ్లే కంప్లయింట్స్‌ చేస్తారు: పూరి

Oct 15 2020 @ 21:34PM

ప్రతిదానికి అన్‌ హ్యాపీగా ఉంటే నాశనం అయిపోయేది నువ్వే. నీ ఇంటి ముందు ఉన్న చెట్టును చూడు. వాటికి అన్‌ హ్యాపీ అంటే తెలియదు. నవ్వుతూ ఉంటాయ్‌, నీడను ఇస్తాయ్‌. పండుని ఇస్తాయ్‌ తప్ప.. గాలి వచ్చి కొమ్మలు ఇరిగినా, గొడ్డలితో నరికినా.. అవి ఎప్పటికి కంప్లయింట్‌ చేయవు.. అని అన్నారు డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో కంప్లయింట్స్‌ అనే టాపిక్‌ మీద ఆయన మాట్లాడారు. మరి కంప్లయింట్స్‌ మీద పూరీ ఇంకా ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

 

''అడవిలో జంతువులు తింటాయ్‌.. హ్యాపీగా ఆడుకుంటాయ్‌. అలెర్ట్‌గా ఉంటాయ్‌.. లేదా నిద్రపోతాయ్‌. కానీ వాటికి అన్‌ హ్యాపీగా ఉండటం అంటే ఏమిటో తెలియదు.  కానీ మనకి తెలుసు. పక్షులకు హ్యాపీనెస్‌ తెలుసు కానీ, అన్‌ హ్యాపీనెస్‌ అనేది అసలు తెలియదు. మనకు తెలుసు జీవితంలో అన్‌ హ్యాపీ అనేది. మనకి లేనివన్నీ గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తామ్‌. మన ఏడుపంతా లేని దానికోసమే. ఉన్నదానిని చూసి ఆనందపడటం తెలియదు. నువ్వు పడుకున్నది చాపే కావచ్చు. దానికి పెద్ద బొక్క ఉండవచ్చు. ఉంటే ఉండనీ, పైన ఉన్న వెన్నెలను చూడు. ఆ చందమామను చూడు. చందమామని చూడడానికి కళ్లు ఉన్నందుకు సంతోషించు. ఎందుకంటే కళ్లు లేనివాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా అన్‌ హ్యాపీగా ఉండేవాళ్లెప్పుడు కంప్లయింట్స్‌ చేస్తుంటారు. కంప్లయింట్స్‌ చేసి చేసి వాళ్లు నెగిటివ్‌ అయిపోతారు. వాళ్ల ముఖాలు ప్లజంట్‌గా ఉండవు. వాళ్లతో మాట్లాడ బుద్ధి కాదు. 

మా ఆఫీస్‌లో ఏ ప్రాబ్లమ్‌ వచ్చినా.. ప్రాబ్లమ్‌ అనే వర్డ్ వాడం. ఛాలెంజ్‌ అనే పదం వాడతాం. ఎందుకంటే ఛాలెంజ్‌ని సాల్వ్ చేయాలనిపిస్తుంది. ప్రాబ్లమ్‌ అంటే ఎస్కేప్ చేయాలనిపిస్తుంది. నేను రోజూ తినే ఫుడ్‌ మీద కూడా ఎప్పుడూ కంప్లయింట్‌ చేయను. ఆరోజు ఏది దక్కితే అది తినడమే. డబ్బు పే చేసిన హోటల్‌లో కూడా ఫుడ్‌ బాగోకపోతే కంప్లయింట్‌ చేయను. కానీ ఫుడ్‌ బాగుంటే మాత్రం ఆ చెఫ్‌ని కలిసి మరి థ్యాంక్స్‌ చెబుతాను. మిలటరీలో ఉన్న మొగుడు రావడం లేదని సంవత్సరం అంతా ఏడవవచ్చు. పండగకి వస్తాడులే.. అని రోజూ హ్యాపీగా కూడా ఉండొచ్చు. ప్రతిదానికి అన్‌ హ్యాపీగా ఉంటే నాశనం అయిపోయేది నువ్వే. నీ ఇంటి ముందు ఉన్న చెట్టును చూడు. వాటికి కూడా తెలియదు అన్‌ హ్యాపీ అంటే. నవ్వుతూ ఉంటాయ్‌, నీడను ఇస్తాయ్‌. పండుని ఇస్తాయ్‌ తప్ప.. గాలి వచ్చి కొమ్మలు ఇరిగినా, గొడ్డలితో నరికినా.. అవి ఎప్పటికి కంప్లయింట్‌ చేయవు.." అని పూరీ చెప్పుకొచ్చారు.  



ఇవి కూడా చదవండి :

మీ ఊళ్లో ఉండకండి: పూరీ జగన్నాథ్2050 నాటికి ప్రపంచ నదుల్లో సగం ఎండిపోయి ఉంటాయి: పూరీ జ‌గ‌న్నాథ్‌దేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరిప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరిపాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.