Advertisement

చచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరి

Oct 6 2020 @ 18:51PM

చనిపోయే లోపు ఒక్కసారైనా ఆయనని కలవాలనేది నా కోరిక. న్యాచురల్‌ హిస్టారియన్‌ డేవిడ్‌ అటెన్‌బరో గురించి తెలుపుతూ.. డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ అంటోన్న మాట ఇది. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన డేవిడ్‌ అటెన్‌బరో గురించి చెప్పుకొచ్చారు. 94 సంవత్సరాల డేవిడ్‌ అటెన్‌బరో ప్రోగ్రామ్స్ గానీ లేకపోతే.. వైల్డ్ లైఫ్‌ గురించి మనకి ఏ విషయం తెలిసేది కాదని.. పూరి ఆయన గొప్పతనాన్ని ఈ ఆడియోలో చెప్పుకొచ్చారు. మరి అంత గొప్ప డేవిడ్‌ అటెన్‌బరో గురించి పూరీ ఏం చెప్పాడో తెలుసుకుందామా..? 

 

"డేవిడ్‌ అటెన్‌బరో.. ఈ పేరు చాలా మందికి తెలియదు. గాంధీ సినిమాను డైరెక్ట్ చేసిన రిచర్డ్ అటెన్‌బరో పేరు మీకు ఐడియా ఉండే ఉంటుంది. వాళ్ల తమ్ముడు ఈ డేవిడ్‌ అటెన్‌బరో. హి ఈజ్‌ ఏ న్యాచురల్‌ హిస్టారియన్‌. 1926లో లండన్‌లో పుట్టాడు. అయితే చిన్నప్పటి నుంచి ఫాజిల్స్, పురాతనమైన స్టోన్స్, న్యాచురల్‌ స్పెసిమెన్స్‌ కలెక్ట్ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత కేమ్‌ బ్రిడ్జి యూనివర్సిటీలో జియోలజీ, జువాలజీ చదువుకున్నాడు. అతనికి నేచర్‌ అంటే విపరీతమైన ఇష్టం. కొన్నేళ్ల తర్వాత అతనికి బీబీసీలో జాబ్‌ వచ్చింది. అప్పుడు బీబీసీలో యానిమల్‌ ప్యాట్రన్స్ అని ఒక సిరీస్‌ చేశాడు. దాని తర్వాత యాంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. జంతువులను ఇంకా డీప్‌గా స్టడీ చేయడం మొదలెట్టాడు. అంతేకాదు వాటిని ఫిల్మింగ్‌ చేద్దామని డిసైడ్‌ చేసుకున్నాడు. లైఫ్‌ ఆన్‌ ఎర్త్ అనే స్క్రిఫ్ట్ రెడీ చేసుకుని.. చెప్తే.. బీబీసీ వాళ్లు అతనికి సపోర్ట్ చేశారు. అది షూట్‌ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. యానిమల్స్‌ను రోజూ ఫాలో అవుతూ.. షూటింగ్‌ చేయాలంటే.. నెలలు, సంవత్సరాలు పడతాయి. అయినా సరే.. అతని ఇంట్రెస్ట్ చూసి బీబీసీ మొదలుపెట్టింది. 

బీబీసీ కోసం అతను వైల్డ్ లైఫ్‌ మీద ఎన్నో డాక్యుమెంటరీస్‌ తీశాడు. ఈవాళ మనం చూసే బీబీసీ, డిస్కవరీ, నేషనల్‌ జియోగ్రఫీ ఇలా అన్నిటికీ ఆయనే కారణం. ఆయన ప్రోగ్రామ్స్ గానీ లేకపోతే.. మనకి ఏ విషయం తెలిసేది కాదు. ఒక ఐస్‌ బర్గ్‌ మెల్ట్ అవుతున్న దృశ్యాలు చూస్తాం. అది షూట్‌ చేయాలంటే.. ఎన్నో నెలలు కెమెరాలు పట్టుకుని వెయిట్‌ చేయాలి. తాబేళ్లు గుడ్లు పెట్టి.. అవి పిల్లలై మళ్లీ సముద్రంలోకి వెళ్లడం చూడాలంటే.. మంత్స్ టుగెదర్‌ వెయిట్‌ చేయాలి వాళ్లు. జీవితాంతం ఆయన అడవిలోనే బతికాడు. డేంజరస్‌ క్లైమెట్స్‌లో, డెడ్లీ వెదర్‌ కండీషన్స్‌లో బతికాడాయన. నెట్‌ప్లిక్స్‌లో అవర్‌ ప్లానెట్‌ అని ఆయన చేసిన ఓ ప్రోగ్రామ్‌ ఉంది. అందులో మేకింగ్‌ చూస్తే.. ఆయన, ఆయన టీమ్‌ ఎంత కష్టపడతారో తెలుస్తుంది. మైనస్ టెంపరేచర్స్‌లో, ఫ్రీజింగ్‌ వెదర్‌లో.. క్రూ మొత్తం వణుకుతూ పనిచేస్తారు. ఆయన జంతువులను చూస్తూ.. వాటి మధ్య పడుకుంటూ.. చిన్న చిన్న పురుగుల నుంచి బిగ్గెస్ట్ బ్లూవేల్‌ వరకు అన్నీటి గురించి తెలుసుకున్నాడు. వాటి బిహేవియర్స్ గానీ, ఎమోషన్స్ గానీ, అబౌట్‌  ద బీడింగ్‌, మైగ్రేషన్‌.. ఎవ్రీథింగ్‌ ఇక్కడున్న క్రీచర్స్ గురించి ఆయనకు తెలిసినంత ఆ దేవుడికి కూడా తెలియదు. నాట్‌ ఓన్లీ యానిమల్స్‌.. లాస్ట్ 60 ఇయర్స్ నుంచి ఇన్విరాన్‌మెంట్‌ గురించి చదువుకుంటూనే ఉన్నాడు. ఎంతో మందికి ఈయన స్ఫూర్తి. హిజ్‌ నోన్‌ ఫర్‌ హిజ్‌ వాయిస్‌. డాక్యుమెంటరీలో ఆయన వాయిస్‌ వినండి.. ఎంతో స్మూతింగ్‌గా ఉంటుంది. అన్ని విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా.. చక్కగా చెబుతాడాయన. ఆయన స్టోరీ నేరేషన్‌ ఒక చక్కని కథలా ఉంటుంది. యానిమల్స్‌ని దగ్గరగా చూసి చూసి ఆయన వేగన్‌గా మారిపోయాడు. హి మేడ్‌ ఇన్‌క్రిడబుల్‌ స్టోరీస్‌ ఆన్‌ నేచురల్‌ వరల్డ్‌ అండ్‌ వైల్డ్ లైఫ్‌. 

ఆయన వయసు ఇప్పుడు 94 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆయన శాలరీ వన్‌ మిలియన్‌ పౌండ్స్. ఆ శాలరీ ఖర్చు పెట్టే టైమ్‌ ఉండదాయనికి. ఎప్పుడూ అడవిలోనే ఉంటాడు. ఈ ఎర్త్ రౌండ్‌ని కొలిస్తే.. ఆ పోల్‌ నుంచి ఈ పోల్‌కి.. మధ్య దూరం 40,000 కి.మీ. అయితే.. ఈయన ఇప్పటి వరకు 4 లక్షల కి.మీ. తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి పదేళ్ళుగా ఎన్నో సార్లు.. మనందరినీ వార్న్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ మనం పట్టించుకోం. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ అతనిని నేషనల్‌ ట్రెజర్‌గా ఫీలవుతుంది. టాప్‌ 100 గ్రేట్‌ బిటన్స్‌లో డేవిడ్‌ అటెన్‌బరో ఒకరు. చనిపోయే లోపు ఒక్కసారైనా ఆయనని కలవాలనేది నా కోరిక. ఆయన చెప్పింది ఒక్కటే.. డోంట్‌ వేస్ట్ ఎలక్ట్రిసిటీ. డోంట్‌ వేస్ట్ పేపర్. డోంట్‌ వేస్ట్ ఫుడ్‌. లీవ్‌ ద వే.. యు వాంట్‌ టు లీవ్‌.. జస్ట్ డోంట్‌ వేస్ట్.. ‌‌" అని పూరి డేవిడ్‌ అటెన్‌బరో గురించి చెప్పుకొచ్చారు. ఇవి కూడా చదవండి :

జ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.