ఫ్రెండ్షిప్ వేరు.. ఫ్రెండ్లీనెస్ వేరు. ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్ ఉంటాడు. ఫ్రెండ్లీనెస్లో ఎవ్వడూ ఉండడు. నువ్వే ఉంటావ్. నీకు ఇష్టమైనవాడితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు.. అసలు వాడెవడో తెలియకపోయినా.. వాడితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఫ్రెండ్లీనెస్ మన ఇన్నర్ క్వాలిటీ అయి ఉండాలి.. అని అన్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో ఫ్రెండ్లీనెస్ గురించి చెప్పుకొచ్చారు.
‘‘దారిలో మీకొక చిన్న కుక్కపిల్ల కనబడతది. మిమ్మల్ని చూడగానే తోక ఊపుతూ దగ్గరకు వస్తది. దానికి మీరెవరో తెలియదు.. అయినా సరే, నవ్వుతూ మీ చుట్టూ తిరుగుతుంటుంది. కాసేపు దానితో ఆడుకుని వెళ్లిపోతారు. మీరు తిరిగి వచ్చేసరికి అది ఇంకెవరితోనే ఉండటం చూస్తారు. అందరికీ ఆ కుక్కంటే ఇష్టం. నిమిషం తిరగకుండానే ఫ్రెండ్ అయిపోతది. దానితో కాసేపు ఉన్నా.. హాయిగా ఉంటుంది మీకు. ఆ కుక్కలో ఉన్నది ఫ్రెండ్లీనెస్. ఫ్రెండ్లీనెస్ అనేది ఒక క్వాలిటీ. అది రిలేషన్ కాదు. ఫ్రెండ్షిప్ వేరు.. ఫ్రెండ్లీనెస్ వేరు. ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్ ఉంటాడు. ఫ్రెండ్లీనెస్లో ఎవ్వడూ ఉండడు. నువ్వే ఉంటావ్. నీకు ఇష్టమైనవాడితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు.. అసలు వాడెవడో తెలియకపోయినా.. వాడితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఫ్రెండ్లీనెస్ మన ఇన్నర్ క్వాలిటీ అయి ఉండాలి.
ఎక్కడో అడవిలో అందమైన పువ్వు పూస్తది. దానిని ఎవడైనా వాసన చూసినా, చూడకపోయినా.. అది అంతే. వాసన వెదజల్లుతూ ఉంటుంది. బేసిగ్గా అది ఎవడి కోసమూ పూయదు. ఎవడికోసమో పరిమళింపదు. అది దాని లక్షణం. మనం కూడా ఆ పువ్వులా ఉండాలి. ఫ్రెండ్షిప్ చేయాలంటే ఫ్రెండ్ కావాలి. లవ్ చేయాలన్నా పార్టనర్ కావాలి. ఏ రిలేషన్ షిప్ కోరుకున్నా ఎవరో ఒకరు కావాలి..’’ అంటూ పూరి ఫ్రెండ్లీనెస్ గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఫ్రెండ్లీనెస్ గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.