ప్రపంచంలోనే గొప్ప కల్చర్ మనది. కానీ మనం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. ఆవును పూజిస్తాం.. కానీ అదే ఆవుని నాలుగు రోజుల తర్వాత నరికేస్తాం. హయ్యస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచే జరుగుతుంది.. అని తెలిపారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో 'గ్రేట్ కల్చర్' అనే టాపిక్ మాట మాట్లాడారు. గొప్ప కల్చరే కానీ జన్యూన్‌గా పాటించడం లేదంటున్న పూరీ వాదనెంటో తెలుసుకుందామా..
''ప్రపంచంలోని అన్ని కల్చర్స్‌లో నేచర్‌ని ప్రేమించే కల్చర్ మనదే. మనం నేచర్‌ని ప్రేమిస్తాం. నేచర్‌ని పూజిస్తాం. నేచర్‌లోనే దేవుడిని చూస్తాం. అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు.. వీళ్లే మన దేవుళ్లు. మనచుట్టూ ఉన్న అని రకాల జంతువుల్ని.. ఏదో ఒక దేవుడి వాహనంగా చూశాం. ఆవులాంటి సాధుజంతువులని కూడా మనం దైవంగా భావిస్తాం. ఏనుగులో వినాయకుడిని చూస్తాం. పూజలు చేస్తాం. ఫారెస్ట్‌లో పిక్నిక్లో పెట్టుకుంటాం. వనభోజనాలు. ఇంటిముందు ముగ్గు వేస్తాం. అది బియ్యపుపొడితో కలిసి వేస్తాం. ఎందుకంటే.. చీమలకి ఆహారంగా పనికివస్తాయని. చనిపోతే.. పిండాలు పెడుతూ.. కాకుల కోసం ఎదురుచూస్తాం. దశ అవతారాల్లో కూడా జంతువులని చూశాం. మత్స్య అవతారం, కూర్మ అవతారం, నృసింహ అవతారం, వరహా అవతారం.. అలాగే చెట్టకు మొక్కుతాం. ప్రతి ఊరిలో ఉన్న అమ్మోరులందరూ చెట్లే. చల్లని నీడని ఇచ్చే ఆ చెట్లకిందే పండగ చేసుకుంటాం. పాములకు మొక్కుతాం. నాగులచవితి చేస్తాం. సృష్టికి మూలంగా భావిస్తూ.. లింగానికి పూజ చేస్తాం. సీజన్స్‌కు వేల్యూ ఇస్తాం. వాటి ప్రకారమే మనం పండుగలు చేసుకుంటాం. అలాగే ప్రతి నదిని గౌరవిస్తాం. అన్ని నదులకి దేవతల పేర్లే పెట్టుకున్నాం. పూజలు చేస్తూ.. గంగలో మునుగుతాం. ఇలా నేచర్‌ని ప్రేమిస్తూ.. నేచర్‌ని పూజించే కల్చర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ మనం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. ఆవును పూజిస్తాం.. కానీ అదే ఆవుని నాలుగు రోజుల తర్వాత నరికేస్తాం. హయ్యస్ట్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచే జరుగుతుంది. ఏనుగుని పూజిస్తాం.. కానీ దంతాలున్న ఏ ఏనుగుని ప్రాణాలతో వదలలేదు. లెక్కల ప్రకారం 30 వేల ఏనుగులని చంపేశాం. కుంకుమ రాసిన చెట్లను తప్ప.. మిగతా అన్నింటిని నరికేస్తాం. శివుడి మెడలో పాముని తప్ప.. మిగతా ఏ పాము కనిపించినా కర్రలతో బాది చంపేస్తాం. కుంభమేళాల పేరుతో దేవతల వంటి నదులని నాశనం చేశాం. మన కల్చర్‌ని మనం జన్యూన్‌గా పాటించకపోవడం వల్ల అది సూడో కల్చర్‌గా మారిపోయింది..'' అని పూరీ.. గ్రేట్ కల్చర్ గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.