నల్లని శరీరం, ధృడమైన దేహం, ఎర్రని నాలుక. సౌతాఫ్రికన్ లేడీ మైటోకాండ్రియల్ ఈవ్ మన తల్లి కాళీకాదేవి అని తెలిపారు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన మైటోకాండ్రియల్ ఈవ్ అనే టాపిక్ మీద మాట్లాడారు. మన చరిత్ర ఎలా పుట్టిందో తెలిపేలా.. మైటోకాండ్రియల్ ఈవ్ గురించి పూరి ఈ ఆడియోలో తెలిపారు. అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
''1985లో డిఫ్రంట్ కంట్రీస్ నుంచి, డిఫ్రంట్ పాపులేషన్ నుంచి ఒక 150 మంది ఆడవాళ్ల డిఎన్ఏ టెస్ట్ చేస్తే.. వాళ్లందరూ ఒర్జినెటెడ్ ఫ్రమ్ సౌతాఫ్రికా అని తెలిసింది. ఆ జాతి 2 లక్షల సంవత్సరాల క్రితం ధె ఆల్ బిలాంగ్ టు మైటోకాండ్రియల్ ఈవ్. అంటే అర్థం ద స్పీసెస్ హోమోసెఫిషియన్స్. మోడ్రన్ హ్యూమన్స్ అందరికీ ఎన్సిస్టర్స్ అమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ మైటోకాండ్రియల్ ఈవ్. సౌతాఫ్రికా నుంచి ఇలాంటి తల్లులందరూ తమ పిల్లలని చంకన పెట్టుకుని, ఎన్నో కష్టాలు పడుతూ.. పిల్లలను కాపాడుకుంటూ.. కొన్ని వేల సంవత్సరాలు.. ఎన్నో ఎన్నో జనరేషన్స్ జనరేషన్స్ ట్రావెల్ చేసి అరవై వేల సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చారు. కొంతమంది తల్లులు 40 వేల సంవత్సరాల క్రితం యూరప్ చేరారు. మిగిలిన వాళ్లు 25 వేల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చేరారు. అప్పుడు పెళ్లిళ్లు లేవు. తండ్రులు ఎవరో తెలియదు పిల్లలకి. అమ్మ మాత్రమే తెలుసు. పలానా తల్లి పిల్లలగానే అందరికీ తెలుసు. మాతృస్వాయ్య వ్యవస్థ.
అందుకే ఇండియాలో ఉన్న నదులు, కొండల పేర్లు ఆడవాళ్లవే ఉంటాయి. అమ్మ తప్ప పిల్లలకి ఎవరూ తెలియదు. పెళ్లిళ్లు లేకపోవడం వలన వేరే రిలేషన్స్ కూడా లేవు. నాన్న, పెదనాన్న, మావయ్య వంటి వారు వీళ్లకి తెలియదు. వాళ్లకి అన్నీ అమ్మే. వాళ్ల అమ్మ ఆరడుగుల పైన ఉండేది. బలిష్టంగా ఉండేది. చేతిలో ఆయుధం. వేటాడి పిల్లలకు పెట్టేది. పిల్లల జోలికి ఎవరైనా వస్తే నరికేది. ఆ తల్లే మన కాళీకామాత. మైటోకాండ్రియల్ ఈవ్.. నల్లని శరీరం, ధృడమైన దేహం, ఎర్రని నాలుక. సౌతాఫ్రికన్ లేడీ మైటోకాండ్రియల్ ఈవ్ మన తల్లి కాళీకాదేవి. ." అని పూరీ చెప్పుకొచ్చారు.