అక్కడ ఏది పడితే అది వండరు. ఇందులో సేఫ్టీ, మైక్రోబయోలజీ, రిజర్వేషన్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, ఫిజిక్స్.. ఇలా అన్నీ ఉంటాయ్. అమ్మా.. చికెన్‌లో వెరైటీలు ఏమున్నాయంటే కుదరదు. వాళ్ల దగ్గర సైంటిస్ట్‌లు కనిపెట్టిన కొన్ని ఐటమ్స్ ఉంటాయ్. అవే తినాలి... అని చెప్పుకొచ్చారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన తన పూరీ మ్యూజింగ్స్‌లో మాలిక్యులర్ గ్యాస్ట్రోనమి అనే టాపిక్ మీద మాట్లాడారు. మాలిక్యులర్ గ్యాస్ట్రోనమి.. పేరే చాలా వెరైటీగా ఉంది.. మరి దీని వివరాలు ఏంటో తెలుసుకుందామా..
''ఫుడ్ లవర్స్ కోసం చిన్న వార్త. మీకు అన్ని రకాల ఫుడ్స్ తెలుసు. అన్ని దేశాల్లో ఏమేం తింటున్నారో కూడా తెలుసు. ఇప్పుడు, ఈ జనరేషన్లో ఓ మోడరన్ ఫుడ్ వచ్చింది. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. అదే మాలిక్యులర్ గ్యాస్ట్రోనమి. పేరు వింటే ఇది ఫుడ్డా.. సైన్సా అని డౌట్ వస్తది. ఇది అలాంటిది. నికోలస్ కుర్తీ అనే వ్యక్తి యుకె ఆక్స్‌ఫర్డ్‌లో ఫిజిసిస్ట్. బాగా ముసలాయన. 1908లో పుట్టాడు. అతను కనిపెట్టాడు.. ఈ మాలిక్యులర్ గ్యాస్ట్రోనమి ఫుడ్. గ్యాస్ట్రోనమి అంటే ద సైన్స్ ఆఫ్ గుడీటీ. వండుతున్నప్పుడు కెమికల్ అండ్ ఫిజికల్ పొసెస్ని దృష్టిలో పెట్టుకుని.. మాలిక్యుల్స్ స్టడీ చేస్తూ వండుతారు. ఏంట్రా ల్యాబ్‌లో వండుతారా? అనే ఫీలింగ్ వచ్చింది కదా.. మీకు. కరెక్ట్‌గా అదే. మోడ్రన్ స్టైల్ ఆఫ్ కుకింగ్. ఏది పడితే అది వండరు. ఇందులో సేఫ్టీ, మైక్రోబయోలజీ, రిజర్వేషన్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, ఫిజిక్స్.. ఇలా అన్నీ ఉంటాయ్. అమ్మా.. చికెన్‌లో వెరైటీలు ఏమున్నాయంటే కుదరదు. వాళ్ల దగ్గర సైంటిస్ట్‌లు కనిపెట్టిన కొన్ని ఐటమ్స్ ఉంటాయ్. అవే తినాలి. వాళ్ల ఐటమ్స్ పేర్లు చెబుతాను.. గిబ్స్, బామిన్ ఇలా ఉంటాయ్. ఏవీ అర్థం కావు. ఈ రెస్టారెంట్‌ని ఎవరుపడితే వారు స్టార్ట్ చేయలేరు.. సర్టిఫైడ్ చెఫ్స్ కావాలి.." అంటూ మాలిక్యులర్ గ్యాస్ట్రోనమి గురించి పూరీ చెప్పుకొచ్చారు. ఇంకా మాలిక్యులర్ గ్యాస్ట్రోనమి గురించి పూరీ ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.