''ఎన్షియంట్ బుక్స్ చాలా ఉంటాయ్. ఎప్పుడెప్పుడో.. ఎవరెవరో అతి పురాతనమైన భాషలో రాసినవి. అవన్నీ స్టోర్ చేసి పెట్టారు.. వాటిని డీకోడ్ చేసి ఆ నాలెడ్జ్ అంతా భద్రపరిచారు. అయితే ఒకే ఒక్క బుక్ అందరినీ డిస్టర్బ్ చేసింది. అదే వాయ్నిచ్ మెనుస్ర్కిప్ట్. ఇది 15వ శతాబ్దంలోనిది. ఎవడు రాశాడో తెలియదు. ఇది చేతి వ్రాతతో రాసింది. కోడెడ్ ప్యాట్రన్‌లో రాశాడు. 246 పేజీల పుస్తకం. యానిమల్ స్కిన్‌తో అట్ట కూడా వేశాడు. దానికి ఇండెక్స్ లేదు. ఇది లూపింగ్ స్ర్కిప్ట్‌లో రాశాడు. 25 నుంచి 30 పాత్రలు ఉన్నాయ్. ఎడమ నుంచి కుడికి రాశాడు. రాసిన వాడు ఎవడో తెలియదు కానీ.. చక్కగా, అందంగా రాశాడు. అంతేకాదు.. ప్రతి పేజీలో అందమైన డయాగ్రమ్స్ వేశాడు. ప్లాంట్స్, ప్లానెట్స్, ఆస్ట్రనామికల్ సింబల్స్ ఇలా అన్నీ వేశాడు. ఒక పేజీలో అయితే.. చాలా మంది ఆడవాళ్లు పూల్‌లో స్నానం చేస్తున్నట్లు బొమ్మ వేశాడు. ఆ ఆడవాళ్లు ఎవరు? రాణులా? చెలికత్తెలా? లేదా వాడి గాళ్ ఫ్రెండ్సా? అనేది తెలియదు. అన్ని కలర్స్ వాడి.. కలర్ ఫుల్‌గా తయారు చేశాడు.. ఆ పుస్తకాన్ని. చాలా అందమైన బుక్...." అంటూ 'మిస్టీరియస్ బుక్' గురించి పూరీ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఈ బుక్ గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.