పవర్లో ఉన్నవాళ్లు.. ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్‌కు మాత్రమే అవకాశాలు కల్పించడాన్ని నెపోటిజం అంటారు.. అని అన్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన తన పూరీ మ్యూజింగ్స్‌లో నెపోటిజం అనే టాపిక్ మీద మాట్లాడారు. నెపోటిజం, క్రోనిజం అంటే ఏమిటి? అవి ఎలా ఉద్భవిస్తాయి..? అటువంటివి ఎదురైనప్పుడు ఏం చేయాలి? వంటి విషయాలను పూరీ చాలా విపులంగా తెలియజేశారు. మరి ఆయన నెపోటిజం గురించి ఏం చెప్పారో తెలుసుకుందా..
''నెపోటిజం అంటే.. పవర్లో లేదా ఒక ఫొజిషన్లో ఉన్నోడు.. ఫ్యామిలీ మెంబర్స్‌కి లేదా ఫ్రెండ్స్‌కి మాత్రమే జాబ్స్ ఇవ్వడం లేదా.. వాళ్లకే ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇది నిజానికి మన అందరి బ్లడ్‌లో ఉంటుంది. ఒక జాతి పక్షులు ఒక చోట చేరుతాయ్. ఒక వీధిలోని కుక్కలన్నీ కలిసి ఉంటాయ్. వేరే కుక్కలను దగ్గరకి రానివ్వవు. అదే నెపోటిజం. మీ అమ్మ చేతిలో ఒకే ఒక్క రొట్టె ఉంటే.. మీ అమ్మ నిన్ను మాత్రమే చంకన ఎత్తుకుని నీకే తినిపిస్తది. ఇట్స్ కాల్డ్ నెపోటిజం. పక్కంటి కుర్రవాడు బాగా ఆకలితో వచ్చి.. మీ అమ్మ వంక బేలగా చూస్తుంటాడు. మీ అమ్మ జాలిపడి.. వాడికొక చిన్న రొట్టెముక్క పెడుతుంది. ఎందుకంటే వాడు మీ అమ్మ స్నేహితురాలి కొడుకు. దట్స్ కాల్డ్ క్రోనిజం. రోడ్డు అవతల ఉన్న కుర్రాడు.. ఆకలితో వాళ్ల దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళతాడు. వాడు ఎక్కడ రొట్టె ఎత్తుకు వెళతాడో అని.. మీ అమ్మ రొట్టెను బుట్టలో పెట్టేసి.. నిన్ను, నీ పక్కింటి పిల్లాడిని తీసుకుని గుడిసె తలుపు వేసేస్తది. అప్పుడు వాడు అరుస్తాడు.. నెపోటిజం నశించాలి. క్రోనిజం డౌన్ డౌన్ అని. రొట్టె ఎక్కడ ఉంటే అక్కడికి చేరతారు అందరు. కోట్ల ఆస్తిని మీ నాన్న.. నీ పేరు మీదే ఎందుకు రాస్తున్నాడు.. నా పేరు మీద రాయవచ్చుగా..? మా నాన్న చచ్చిపోతే.. ఆ అప్పులు నేనే ఎందుకు కట్టాలి.. ఏ.. నువ్వు కట్టవచ్చుగా..?..'' అంటూ పూరీ నెపోటిజం గురించి చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన నెపోటిజం గురించి ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.