పల్లెటూర్లలో ఫుడ్ వేస్ట్, పేడ, చెత్త ఇలాంటివన్నీ పెంటకుప్పగా పోసి, అవి కుళ్లగానే పొలానికి ఎరువుగా వాడతాం. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినప్పటి నుంచి అన్నీ కలిసిపోయి.. రీసైక్లింగ్ చేయలేకపోతున్నాం.. అని తెలిపారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆయన తన పూరీ మ్యూజింగ్స్‌లో 'రీసైక్లింగ్' అనే టాపిక్ గురించి మాట్లాడారు. రీసైక్లింగ్‌పై ఆయన అభిప్రాయమేమిటో విందామా..
''రీసైక్లింగ్ అంటే వేస్ట్ మెటీరియల్స్ని మళ్లీ పనికొచ్చే అంటే కొత్త మెటీరియల్స్గా మార్చడం. పేపర్, కార్డ్ బోర్డ్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, మెంటర్ కంటైనర్స్ మొదలగునవి. వీటన్నిటిని రీసైక్లింగ్ చేయవచ్చు. రీసైక్లింగ్ చేయలేనివి కొన్ని ఉన్నాయ్.. అవి ఫుడ్ వేస్ట్, చినిగిపోయిన బట్టలు, పాడైపోయిన షూస్, పగిలిని క్లాస్ ముక్కలు..ఇలాంటివి. అయితే రీసైకిల్ చేయతగ్గ వాటిని కంపల్సరీగా చేయాలి. దాని వలన మైనింగ్, క్వారింగ్ తగ్గుతుంది. మనకి పూర్వం నుంచి రీసైక్లింగ్ అలవాటు ఉంది. పల్లెటూర్లలో ఫుడ్ వేస్ట్, పేడ, చెత్త ఇలాంటివన్నీ పెంటకుప్పగా పోసి, అవి కుళ్లగానే పొలానికి ఎరువుగా వాడతాం. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చినప్పటి నుంచి అన్నీ కలిసిపోయి.. రీసైక్లింగ్ చేయలేకపోతున్నాం. రీసైకిల్ చేయాలంటే.. వాటిని కేటగిరైజ్ చేయాలి.
జపాన్‌లో కమికాసు అనే ఒక విలేజ్ ఉంది. జీరో వేస్ట్ అక్కడ. ప్రపంచానికి ఆ విలేజ్ ఒక ఉదాహరణ. అక్కడ చెత్త పడేయడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. అక్కడకెళ్లి ట్రాష్ బ్యాగ్‌లో ఉన్న చెత్తని, దేనికిదానికి సెపరేటుగా అక్కడున్న బుట్టలో వేయాలి. 45 రకాల బాక్స్‌లు అక్కడ పెట్టారు. విలేజ్‌లో ప్రతి ఒక్కరూ అన్నిటిని సెపరేట్‌గా చేసి వెళ్లిపోతారు. ఇలా చేయడం వల్ల వారికి రీసైక్లింగ్ ఈజీ అయిపోయింది. ప్రతి వేస్ట్‌ని మళ్లీ యూజ్ చేయగలుగుతున్నారు. ఒక్కసారి కమికాసు విలేజ్ చూడండి. విలేజ్ ముద్దొస్తది. అలాగే స్విట్జర్లాండ్‌లో ప్రతి ఇంటి నుండి ట్రాష్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుంటారు. అయితే అక్కడ మున్సిపాలిటీ వారు ఇచ్చిన ట్రాష్ బ్యాగ్‌లనే వాడాలి. ఎందుకంటే వాటి మీద గవర్నమెంట్ స్టాంప్ ఉంటది. మీరు ట్రాష్ బ్యాగ్ ఇవ్వగానే బరువు చూసి మీకు బిల్ వేస్తారు. మీరు ఎంత చెత్త ప్రొడ్యూస్ చేస్తే.. అంత డబ్బు కట్టాలి. అందుకే అక్కడ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు. ఒక టన్ను పేపరును గానీ రీసైకిల్ చేస్తే.. 20 చెట్లు కాపాడినట్లు. 7వేల గెలన్స్ వాటర్ సేవ్ చేసినట్లు... " అంటూ రీసైక్లింగ్ గురించి చెప్పుకొచ్చారు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది వీడియో చూడాల్సిందే.