డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తన పూరీ మ్యూజింగ్స్‌లో 'షార్ట్ ఫామ్స్' అనే టాపిక్ మీద మాట్లాడారు. షార్ట్ ఫామ్స్ గురించి ఆయన ఏం చెప్పారో తెలుసుకుందామా. ''గ్రేట్ బ్రిటన్‌లో మొట్టమొదటిసారి స్టాక్టన్, డార్లింగ్టన్ స్టేషన్ల మధ్య ఓ రైలు ప్రారంభించారు. అది గూడ్సు రైలు, మనుషుల కోసం కాదు. ఆస్కార్ కెల్లీ అనే వ్యక్తి ఈ రెండు స్టేషన్లనూ వాడుకుంటూ.. ఫస్ట్ టైం కొరియర్ సర్వీస్ స్టార్ట్ చేశాడు. ఆ ఊర్లో డాక్యుమెంట్స్ ఇక్కడకు, ఇక్కడివి అక్కడకు పంపించేవాడు. రోజూ వాడు పంపే బాక్సుల మీద ఆస్కార్ కెల్లీ, ఆస్కార్ కెల్లీ అని రాసేవాళ్లు. కొన్నాళ్లకు మొత్తం పేరు రాయడానికి చిరాకేసి వాళ్లు.. ఓ.కే అని రాయడం మొదలెట్టారు. అక్కడి రైల్వే గార్డులు, కొరియర్ కుర్రాళ్లు.. 24 బాక్సెస్ ఓకే? అంటే వాళ్లు ఓకే అనేవారు. 13 బాక్సెస్ ఓకే? అంటే ఓకే అనేవాళ్లు. అలా రెండు స్టేషన్లలో ఓకే.. ఓకే అంటూ థంబ్ చూపించడం మొదలుపెట్టారు. అలా ఓకే అనే మాట ప్రపంచానికి అలవాటైందట. మరికొంతమందేమో ఓకే ఫుల్‌ఫామ్ ఏంటంటే ఆల్ కరెక్ట్ అని చెప్తారు. బట్ నాకు ఈ స్టోరీయే ఇంట్రస్టింగ్‌గా ఉంది. కన్విన్సింగ్‌గా కూడా ఉంది. కాబట్టి దీన్నే నమ్ముదాం.
మొత్తం పలకలేక మనం రోజూ చాలా షార్ట్ ఫామ్స్ వాడతాం. జనవరిని జాన్ అని, అప్రాక్సిమేట్లీని అప్రాక్స్ అని, యూఎస్బీ అంటే తెలుసా? యూనివర్సల్ సీరియల్ బస్, సిమ్ కార్డు అంటే సబ్స్ర్కయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్, మెసేజెస్‌లో లాల్(lol) అని టైప్ చేస్తాం.. లాఫింగ్ అవుట్ లౌడ్ అని. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిడిటీ. కేవైసీ లేక అమెజాన్ డెలివరీ ఆగిపోద్ది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్.. అందుకే మనం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్ ఇదే నాసా. రీసెర్చ్ అనాలసిస్ వింగ్.. రా. రా ఏజెన్సీ. అలాగే ఎల్ఈడీ లైట్స్ అంటాం. ఎల్.ఈ.డీ లైట్ ఎమిటింగ్ డయోడ్... మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే...." అంటూ పూరీ షార్ట్ ఫామ్స్ గురించి మరింత సమాచారం తెలిపారు. అదేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.