అర్చకులు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T05:50:25+05:30 IST

జిల్లా వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకుల వంశపారంపర్య హక్కుల నిర్ధారణకు, ఆలయాల 43 రిజిష్టర్లలో నమోదు చేసేందుకు అర్చకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ కోరారు.

అర్చకులు దరఖాస్తు చేసుకోవాలి

ద్రాక్షారామ, అక్టోబరు 17: జిల్లా వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకుల వంశపారంపర్య హక్కుల నిర్ధారణకు, ఆలయాల 43 రిజిష్టర్లలో నమోదు చేసేందుకు అర్చకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ కోరారు. ద్రాక్షారామలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వంశపారంపర్య హక్కుల ధ్రువీకరణ పత్రాలు కోర్టు తీర్పులు గానీ, దేవదాయ శాఖ అధికారులు ధ్రువీకరించిన పత్రాలు లేదా ఇతర ఆధారాలతో వంశవృక్షం వివరాలు తెలిపే కాపీలను జతపరచి దరఖాస్తులు అందజేయాలని కోరారు. 6 సీ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు సహాయ కమిషనర్‌, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం, 6 బి దేవాలయాల్లో అర్చకులు ఉపకమిషనరు, దేవదాయ శాఖ, కాకినాడ వారికి, 6ఏ (కోటిరూపాయల లోపు ఆదాయం) ఉన్న ఆలయాల అర్చకులు ప్రాంతీయ సంయుక్త కమిషనరు, రాజమహేంద్రవరం, 6ఏ (కోటి రూపాయలు ఆదాయం దాటిన) ఆలయాల అర్చకులు కమిషనరు, దేవదాయ శాఖ, గొల్లపూడి, విజయవాడ వారికి 10 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సహాయ కమిషనర్‌ కోరారు.

Updated Date - 2021-10-18T05:50:25+05:30 IST