పుష్‘అప్స్’

ABN , First Publish Date - 2020-04-22T16:30:16+05:30 IST

శరీరం దృఢంగా మారడానికే కాదు... కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌గా కూడా వాకింగ్‌ పుషప్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఓ పావుగంట కేటాయిస్తే చాలు... కూర్చొన్న చోటే చేసేయవచ్చు.

పుష్‘అప్స్’

ఆంధ్రజ్యోతి(22-04-2020)

శరీరం దృఢంగా మారడానికే కాదు... కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌గా కూడా వాకింగ్‌ పుషప్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఓ పావుగంట కేటాయిస్తే చాలు... కూర్చొన్న చోటే చేసేయవచ్చు.

 

‘ప్లాంక్’ పొజిషన్‌తో మొదలుపెట్టండి. ఇప్పుడు మునివేళ్లు, అరచేతులు మాత్రమే నేలపై ఉంచి, చేతులను పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ పైకి లేవండి. అరచేతుల మధ్య దూరం మీ భుజాలకు సమాంతరంగా ఉండాలి. కాళ్ల నుంచి తల వరకు.. ఒక రేఖ గీసినట్టు ఎక్కడా వంచకూడదు.

 

ఇప్పుడు మోచేతులు 45 డిగ్రీల కోణంలో వంచుతూ, ఛాతీ దాదాపు తగిలేలా బాడీని బెండు చేయాలి. మళ్లీ పైకి లేస్తూ ఇదే తరహాలో చేయగలిగినన్ని సెట్స్ చేయండి. అయితే ప్రతి రోజూ కౌంట్ పెంచుకుంటూ వెళితే, మీ బాడీ మంచి ఆకారం తేలి, బిగువుగా తయారవుతుంది.


తరువాత ఈ చిత్రంలో చూపినట్టు ప్లాంక్ పొజిషన్‌కు రావాలి. ఆంగ్ల అక్షరం ‘వి’ని తిరగేస్తే ఎలా ఉంటుందో అలా మీ బాడీ కనిపించాలి. ఇప్పుడు చేతులు. పాదాల సాయంతో పక్కకు జరగండి. ఇలా సాధ్యమైనన్ని సార్లు చేయండి. ఇది మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా, అంతటితో ఆగిపోవద్దు. ఎందుకంటే.. ప్రాక్టీస్ మేక్స్ పర్‌ఫెక్ట్ కదా!

 

 



Updated Date - 2020-04-22T16:30:16+05:30 IST