`పుష్ప` క్రేజ్ మామూలుగా లేదుగా.. మధ్యప్రదేశ్ లీడర్ల మధ్య `పుష్ప` వార్!

ABN , First Publish Date - 2022-02-03T18:05:46+05:30 IST

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన `పుష్ప` చిత్రం తెలుగులోనే కాకుండా..

`పుష్ప` క్రేజ్ మామూలుగా లేదుగా.. మధ్యప్రదేశ్ లీడర్ల మధ్య `పుష్ప` వార్!

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన `పుష్ప` చిత్రం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‌లో కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా `శ్రీ వల్లి` సాంగ్‌కు బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్ బాగా వైరల్ అవుతోంది. క్రికెటర్లు కూడా మైదానంలో ఆ స్టెప్ వేసి అలరించారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లకు `పుష్ప` మేనియా సోకింది. `పుష్ప` సినిమా వీడియోల్లో నటిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని దామోహ్ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ యశ్‌పాల్ ఠాకూర్ తాజాగా `పుష్ప`లోని `శ్రీవల్లి` సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసి ఎంతో మంది నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఆ వీడియోతో యశ్‌పాల్ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. యశ్‌పాల్‌కు పోటీగా బీజేపీ లీడర్ ప్రమోద్ విశ్వకర్మ కూడా `పుష్ప`నే నమ్ముకున్నారు. 


సినిమాలో కేశవ్‌తో పుష్ప చెప్పే.. `ఏమీ లేనప్పుడే మనం ఇక్కడకు కారులో వచ్చాం. ఇప్పుడు ఐదు లక్షలు ఉన్నాయి మళ్లీ మనం కారులోనే వెళ్లాలి. లేకపోతే ఇక్కణ్నుంచి కదలను` డైలాగును ప్రమోద్ చెప్పి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరు పార్టీల లీడర్లకు సంబంధించిన `పుష్ప` వీడియోలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. 

Updated Date - 2022-02-03T18:05:46+05:30 IST