Pushpa.. అల్లు అర్జున్ సినిమా గురించి ఓవర్సీస్ నుంచి ఫస్ట్ రివ్యూ.. ఆ సినీ విశ్లేషకుడు ఎంత రేటింగ్ ఇచ్చాడంటే..

Published: Thu, 16 Dec 2021 15:49:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Pushpa.. అల్లు అర్జున్ సినిమా గురించి ఓవర్సీస్ నుంచి ఫస్ట్ రివ్యూ.. ఆ సినీ విశ్లేషకుడు ఎంత రేటింగ్ ఇచ్చాడంటే..

ఎన్నారై డెస్క్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఈ మూవీపై తన అభిప్రయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. సినిమాపై ఆయన టాక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం వివరాల్లోకి వెళ్దాం పదండి..


Pushpa.. అల్లు అర్జున్ సినిమా గురించి ఓవర్సీస్ నుంచి ఫస్ట్ రివ్యూ.. ఆ సినీ విశ్లేషకుడు ఎంత రేటింగ్ ఇచ్చాడంటే..

ప్రముఖ సినీ విశ్లేషకుడు, యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఒకరైన ఉమైర్ సంధు.. ‘పుష్ప’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. మూవీ చాలా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా అల్లు అర్జున్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగుందన్నారు. ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్ చిత్రంగా ‘పుష్ప’ నిలిస్తుందని అభిప్రాయపడ్డారు. సరికొత్త గెటప్‌లో అల్లు అర్జున్ అదరగొట్టారని.. తెరపై ఆయనను చూశాక ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమన్నారు. అంతేకాకుండా కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్‌తోపాటు సుకుమార్ దర్శకత్వాన్ని ప్రశంసించారు. 


ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా కనిపించనుండగా.. పల్టెటూరి యువతి గెటప్‌లో రష్మిక యువతకు పిచ్చెక్కించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలన్నీ యూట్యూబ్‌లో ఒక ఊపు ఊపుతున్నాయి. ఇక సమంత ఐటమ్ సాంగ్.. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఓవర్సీస్ సినిమాLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.