దేవదాయ శాఖ డీసీగా పుష్పవర్దన్‌

Jun 23 2021 @ 00:23AM

విశాఖపట్నం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌(డీసీ)గా ఇ.పుష్పవర్దన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్నారు.  రామతీర్థాలలోని హుండీ లెక్కింపులో అవకతవకలు వెలుగు చూడటంతో అప్పుడు డీసీగా ఉన్న సుజాతను సస్పెండ్‌ చేసి, ఆ స్థానంలో కనకమహాలక్ష్మి ఆలయం ఈఓ జ్యోతి మాధవికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. పుష్పవర్దన్‌ గతంలో ఇక్కడ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.