Yuzvendra Chahal : ‘భార్యతో విడాకులు ప్రచారం’పై క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భావోద్వేగం.. అందరికీ ఒక విజ్ఞప్తి. ...

ABN , First Publish Date - 2022-08-19T02:56:21+05:30 IST

టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్(Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ(Dhanashree)కి విడాకులు ఇచ్చాడంటూ సోషల్ మీడియా(Social Media)లో ప్రచారం జరుగుతోంది.

Yuzvendra Chahal : ‘భార్యతో విడాకులు ప్రచారం’పై క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భావోద్వేగం.. అందరికీ ఒక విజ్ఞప్తి. ...

ముంబై: టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్(Yuzvendra Chahal) తన భార్య ధనశ్రీ(Dhanashree)కి విడాకులు ఇచ్చాడంటూ సోషల్ మీడియా(Social Media)లో ప్రచారం జరుగుతోంది. ఈ అసత్య ప్రచారంపై ఇన్‌స్టా వేదికగా చాహాల్ భావోద్వేగంగా స్పందించాడు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘‘ మా బంధానికి సంబంధించిన అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి ఈ ప్రచారానికి ముగింపు పలకండి. అందరికీ ప్రేమ, సంతోషాలు కలగాలని కోరుకుంటున్నా’’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.


కాగా చాహాల్, భార్య ధనశ్రీ ఇద్దరూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. వీరిద్దరూ డిసెంబర్ 2020లో వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఎన్నో వీడియోలను పోస్ట్ చేశారు. యూట్యూబర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మకి సోషల్ మీడియాలో విస్తృతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-19T02:56:21+05:30 IST