పుతిన్ బాధ్యతా రాహిత్యం

Published: Fri, 25 Mar 2022 00:21:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon

రష్యా అధక్ష్యుడు వ్లాదిమిర్ పుతిన్ సహనం కోల్పోతున్నాడు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్న లక్ష్యం నెరవేరకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తికి లోనై విపరీత ఆలోచనలు చేస్తున్నాడు. అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి తాము వెనుకాడబోమని ఆయన హెచ్చరించడం గర్హనీయం. ఆ హెచ్చరిక ఆయన బాధ్యతారాహిత్యాన్ని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సీనియర్ సభ్య దేశమమైన రష్యా అణు యుద్ధ బెదిరింపులకు పాల్పడడం సబబేనా? ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికైనా మేల్కొని పుతిన్‌ను సమైక్యంగా ఎదుర్కోవాలి. ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల ఫలితంగా రష్యా ప్రజలు అనేక కష్టనష్టాలకు లోనవుతున్నారు. అయినంత మాత్రాన అణ్వాయుధ దాడి చేస్తామని పుతిన్ హెచ్చరించడం బాధ్యతారాహిత్యం కాదా? రష్యా అధ్యక్షుడు అటువంటి ఉన్మాద చర్యకు పాల్పడకుండా నివారించేందుకు పత్రికా ప్రపంచం ఆయన హెచ్చరికలను నిర్ద్వంద్వంగా ఖండించాలి. 

వై. భరద్వాజ


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.