ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనేదే పుతిన్ ప్లాన్!

ABN , First Publish Date - 2022-03-04T02:59:52+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు లక్ష్యం ఏమిటి? ఉక్రెయిన్‌ను బెదిరించి

ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనేదే పుతిన్ ప్లాన్!

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు లక్ష్యం ఏమిటి? ఉక్రెయిన్‌ను బెదిరించి దారికి తెచ్చుకోవడమేనా? ఎంతమాత్రమూ కాదంటున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ సన్నిహితుడు. న్యూస్ ఏజెన్సీ ‘ఏఎఫ్‌పీ’తో ఆయన మాట్లాడుతూ .. ఉక్రెయిన్ మొత్తాన్నీ పుతిన్ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని, అదే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.


పుతిన్-మాక్రన్ ఇద్దరూ దాదాపు 90 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడుకున్న కొన్ని గంటలకే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యుద్ధం మరింత భీకరంగా తయారు కాబోతోందని మాక్రన్ విశ్వసిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఏదిఏమైనా ఉక్రెయిన్‌లో తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని మాక్రన్‌తో ఈ సందర్భంగా పుతిన్ చెప్పినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-03-04T02:59:52+05:30 IST