Ukraineపై యుద్ధాన్ని సమర్థించిన రష్యాలోని భారత సంతతి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-03-02T17:59:29+05:30 IST

రష్యాలో భారత సంతతికి చెందిన ఓ శాసనసభ్యుడు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యకు మద్దతుగా నిలిచారు....

Ukraineపై యుద్ధాన్ని సమర్థించిన రష్యాలోని భారత సంతతి ఎమ్మెల్యే

పాట్నా : రష్యా-ఉక్రెయిన్ మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలో భారత సంతతికి చెందిన ఓ శాసనసభ్యుడు డాక్టర్ అభయ్ కుమార్ సింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనిక చర్యకు మద్దతుగా నిలిచారు.పశ్చిమ రష్యా నగరమైన కుర్స్క్ నియోజక వర్గానికి చెందిన సింగ్... రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడాన్ని సమర్థించారు. పొరుగు దేశానికి చర్చలకు తగినంత అవకాశం ఇచ్చిందని, విఫలమైతే యుద్ధ నిర్ణయం తీసుకుందని సింగ్ చెప్పారు.ఉక్రెయిన్‌పై అణుదాడి చేసేందుకు రష్యా యోచిస్తోందన్న ఊహాగానాలను కూడా భారత సంతతికి చెందిన రష్యా శాసనసభ్యుడు తోసిపుచ్చారు. అయితే రష్యాపై మరో దేశం దాడి చేస్తే ప్రతిస్పందించడమే అణ్వాయుధ డ్రిల్‌ నిర్వహించడం ఉద్ధేశమని ఆయన అన్నారు.


అభయ్ కుమార్ సింగ్ బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన వ్యక్తి. దాదాపు 30 ఏళ్ల క్రితం 1991లో మెడిసిన్ చదవడానికి రష్యా వెళ్లారు.అతను పాట్నాలోని లయోలా హైస్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. రష్యాలోని కుర్స్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఆ తర్వాత సింగ్ రిజిస్టర్డ్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడానికి పాట్నాకు తిరిగి వచ్చారు. అయితే అభయ్ కుమార్ సింగ్ రష్యాకు తిరిగి వెళ్లి తన సొంత ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తర్వాత రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించారు.సింగ్ 2015లో వ్లాదిమిర్ పుతిన్ యునైటెడ్ రష్యా పార్టీలో చేరి, 2018లో కుర్స్క్ నుంచి ప్రావిన్షియల్ ఎన్నికల్లో గెలిచారు.


Updated Date - 2022-03-02T17:59:29+05:30 IST