Singapore Open: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. టైటిల్‌కు అడుగు దూరంలో!

ABN , First Publish Date - 2022-07-16T23:19:11+05:30 IST

సింగపూర్ ఓపెన్‌(Singapore Open)లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సంచలనం నమోదు చేసింది.

Singapore Open: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. టైటిల్‌కు అడుగు దూరంలో!

సింగపూర్: సింగపూర్ ఓపెన్‌(Singapore Open)లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సంచలనం నమోదు చేసింది. జపాన్‌కు చెందిన సయేనా కవాకమి (Saena Kawakami)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు ఈ ఏడాది ఇప్పటికే రెండు.. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది.


తాజాగా, కవాకమితో జరిగిన సెమీస్ పోరులో 21-15, 21-17తో వరుస సెట్లలో విజయం సాధించి 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఫలితంగా 2022 సీజన్‌లో తొలి సూపర్ 500 టైటిల్‌కు ఒక్క విజయం దూరంలో నిలిచింది. 

Updated Date - 2022-07-16T23:19:11+05:30 IST