
బాసెల్: భారత షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక టైటిల్ చేరింది. స్విస్ ఓపెన్ ఫైనల్ పోరులో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ను 21-16, 21-8 తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. స్విస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయ క్రీడాకారిణి సింధూయే. 2011, 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్ రెండుసార్లు గెలుచుకున్నారు.