PV Sindhu సంచలన విజయం.. సింగపూర్ ఓపెన్-2022 కైవశం

ABN , First Publish Date - 2022-07-17T17:53:22+05:30 IST

ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సంచలనం సృష్టించింది. సింగపూర్ ఓపెన్ 2022 (Singapore Open 2022) ఉమెన్స్ సింగిల్స్‌లో విజేతగా నిలిచింది.

PV Sindhu సంచలన విజయం.. సింగపూర్ ఓపెన్-2022 కైవశం

కల్లాంగ్ : ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సంచలనం సృష్టించింది. సింగపూర్ ఓపెన్ 2022 (Singapore Open 2022) ఉమెన్స్ సింగిల్స్‌లో విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో చైనా(China) క్రీడాకారిణి వాంగ్ జీయీ (Wang Zhi Yi)పై తిరుగులేని విజయం సాధించింది. 21-9, 11-21, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఫస్ట్ గేమ్‌‌లో ప్రత్యర్థిపై తిరుగులేని ఆదిప్యతం సాధించిన సింధు సెకండ్ గేమ్‌లో కాస్త వెనుకంజ వేసింది. అయితే థర్డ్ గేమ్‌లో రెచ్చపోయి ఆడి 21-15 తేడాతో జయకేతనం ఎగురవేసింది. దీంతో 2022లో తొలి సూపర్ 500 టైటిల్‌ (Super 500 Title Of 2022)ను సింధు ఖాతాలో వేసుకుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి వాంగ్ యూ కూడా అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా సెకండ్ గేమ్‌లో ప్రదర్శన ఆకట్టుకుంది. అయితే థర్డ్ గేమ్ ఆరంభంలో సింధు రెచ్చిపోయి ఆడడం సానుకూలమైంది. టైటిల్ విజేతగా నిలిపింది.


కాగా సెమీస్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి సెనా కవాకమీపై గెలిచి సింధు తుది పోరుకు అర్హత సాధించింది. తొలి రెండు గేమ్‌లను 21-15, 21-7 తేడాతో చేజిక్కించుకుని మరో గేమ్ మిగిలివుండగానే మ్యాచ్‌ని ముగించేసింది. సింధుకి సింగపూర్ ఓపెన్ ఈ సీజన్ 2022లో మూడవ టైటిల్. ఇప్పటికే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ డీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Updated Date - 2022-07-17T17:53:22+05:30 IST