
న్యూఢిల్లీ : భారత్‌లోని రెండు అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ చెయిన్లు... పీవీఆర్, ఐనాక్స్... ఆదివారం దేశంలో అతిపెద్ద మల్టీ-స్క్రీన్ ప్లేయర్‌ను ఏర్పాటు చేసే క్రమంలో... ఓ విలీనాన్ని ప్రకటించాయి. కంటెంట్ స్ట్రీమింగ్ దిగ్గజాల నుండి దాడిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తోన్న క్రమంలో ఈ విలీనం చోటుచేసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పీవీఆర్ అజయ్ బిజిలీ, సిద్ధార్థ్ జైన్ 1,500 స్క్రీన్లతో పీవీఆర్ ఐనాక్స్ గా వ్యవహరించాల్సి ఉన్న విలీన సంస్థకు ఈ పరిణామం సహాయపడుతుందని ఐనాక్స్ లీజర్ పేర్కొంది.
మల్టీప్లెక్స్ పరిశ్రమలో ఏకీకరణ అవసరాన్ని కోవిడ్ మహమ్మారి తీవ్రతరం చేసిందని, వ్యాపారం దీర్ఘకాలిక మనుగడకు సామర్థ్యాలను సాధించడానికి స్కేల్‌ను సృష్టించడం చాలా కీలకమని, అంతేకాకుండా... ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో పోరాడుతుందని చెబుతున్నారు. విలీన సంస్థ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న జైన్ ఈ సందర్భంగా మాట్టాడుతూ ‘గత రెండేళ్లలో మల్టీప్లెక్స్ సినిమా స్క్రీన్లు అత్యంత విజయవంతమ య్యాయని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 9,600 థియేటర్ స్క్రీన్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే... ఐనాక్స్, పీవీఆర్ విలీనం తర్వాత... పీవీఆర్ ప్రమోటర్లు 10.62 % వాటాను కలిగి ఉంటారు. కాగా... ఐనాక్స్ ప్రమోటర్లు సంయుక్త సంస్థలో 16.66 % వాటాను కలిగి ఉంటారు. ఐనాక్స్ షేర్హోల్డర్లు ఐనాక్స్ సంబంధిత 10 షేర్లకు పీవీఆర్‌లో మూడు షేర్లను అందుకుంటారు.
కొత్త కంపెనీకి పది మంది సభ్యుల బోర్డు ఉంటుంది. విలీనం తర్వాత పన్రారంభమయ్యే కొత్త థియేటర్ ‘పీవీఆర్ ఐనాక్స్’గా బ్రాండ్ అవుతుంది. పీవీఆర్ ప్రస్తుతం 73 నగరాల్లోని 181 ప్రాపర్టీలలో 871 స్క్రీన్లను నిర్వహిస్తోంది. ఇక ఐనాక్స్... 72 నగరాల్లోని 160 ప్రాపర్టీలలో 675 స్క్రీన్లను నిర్వహిస్తోంది. సంయుక్త సంస్థ 109 నగరాల్లోని 341 ప్రాపర్టీలలో 1,546 స్క్రీన్లను నిర్వహించే అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా అవతరిస్తుంది.
ఇవి కూడా చదవండి