మేకలను తీసుకుని అడవికి వెళ్లిన పిల్లోడు.. ఇంతలో అనూహ్య ఘటన.. అతడి కేకలు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు.. షాకింగ్ సీన్ చూసి..

Published: Sun, 27 Mar 2022 15:16:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మేకలను తీసుకుని అడవికి వెళ్లిన పిల్లోడు.. ఇంతలో అనూహ్య ఘటన.. అతడి కేకలు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు.. షాకింగ్ సీన్ చూసి..

ఇంటర్నెట్ డెస్క్: వీలైనప్పుడల్లా ఆ పిల్లోడు పనిలో తన తండ్రికి సహాయపడుతూ ఉంటాడు. మేత కోసం మేకలను అడవికి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు అడవికి వెళ్లాడు. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో అప్పటి వరకూ సరదాగా ఆడుకుంటున్న ఆ కుర్రాడు.. ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యాడు. ఏడుస్తూ కేకలు పెట్టాడు. అది విని స్థానికులు పరుగెత్తుకొచ్చారు. అనంతరం అక్కడి దృశ్యం చూసి షాకయ్యారు. ఇంతకూ అక్కడ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్‌లోని వాల్మికీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్న బగహాకు చెందిన వినోద్ మేకల కాపరి. అతడికి కొన్నేళ్ల క్రితమే పెళ్లి కాగా.. ఓ కొడుకు కూడా ఉన్నాడు. వినోద్‌ ఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా.. అతడి కొడుకే మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆ చిన్నోడు.. మేకలతో అడవికి వెళ్లాడు. అవి మేత మేస్తోంటే.. ఆ కుర్రాడు ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇంతలో మేకలన్నీ పరుగులు తీయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆ చిన్నోడు మేకలవైపు చూశాడు. ఓ మేకను పెద్ద కొండ చిలువ చుట్టుముట్టి, దాన్ని మింగడానికి ప్రయత్నించడం చూసి షాకయ్యాడు. భయంతో కేకలు వేశాడు. ఆ అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు. కొండ చిలువపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో మేకను వదిలేసి, కొండచిలువ పారిపోయింది. అయితే ఈ కొండచిలువ దాడిలో మేక ప్రాణాలు పోయాయి. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.