viral video: వామ్మో.. గోడ మీదకు పాకుతున్న ఆ భారీ కొండచిలువను చూస్తే గగుర్పాటు ఖాయం!

ABN , First Publish Date - 2022-01-26T22:39:55+05:30 IST

అల్లంత దూరంలో పాము కనిపిస్తే చాలు.. ఎంతటి ధైర్యవంతుడైనా భయపడతాడు.

viral video: వామ్మో.. గోడ మీదకు పాకుతున్న ఆ భారీ కొండచిలువను చూస్తే గగుర్పాటు ఖాయం!

అల్లంత దూరంలో పాము కనిపిస్తే చాలు.. ఎంతటి ధైర్యవంతుడైనా భయపడతాడు. సాధారణ వ్యక్తులైతే ఆ పరిసరి ప్రాంతాల్లో కూడా ఉండరు. అలాంటిది కొండ చిలువను చూస్తే.. పై ప్రాణాలు పైనే పోతాయి. తాజాగా థాయ్‌లాండ్‌లోని ఓ బిల్డింగ్‌పైకి పాకుతున్న కొండచిలువ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


సుమారు 8 అడుగులు పొడవున్న ఓ భారీ కొండచిలువ గోడపై నుంచి పాకుతూ బిల్డింగ్ పైకి వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కొండచిలువ పైకి పాకుతుండగా.. పక్క ఇంటి పైకప్పు నుంచి పిల్లి దాన్ని చూస్తోంది. అటూ.. ఇటూ తల తిప్పి గమనిస్తూ కూర్చుంది. ఈ వీడియోను `వైరల్‌ హాగ్` అనే యూట్యూబ్ ఛానెల్‌ అప్‌లోడ్‌ చేసింది. దీనికి ఇప్పటివరకు 53 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 



Updated Date - 2022-01-26T22:39:55+05:30 IST