పర్యాటకులకు Qatar గుడ్‌న్యూస్..

ABN , First Publish Date - 2022-06-02T16:18:39+05:30 IST

గల్ఫ్ దేశం ఖతర్ పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఆరోగ్య బీమా ప్యాకేజీలకు ఖతర్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

పర్యాటకులకు Qatar గుడ్‌న్యూస్..

దోహా: గల్ఫ్ దేశం ఖతర్ పర్యాటకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఆరోగ్య బీమా ప్యాకేజీలకు ఖతర్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను క్రమబద్ధీకరించేందుకు 2021లో తీసుకొచ్చిన చట్టం నం. 22లోని నిబంధనలకు అనుగుణంగా సందర్శకులు, పర్యాటకులకు బీమా కోసం ప్యాకేజీ విషయమై ప్రజారోగ్య శాఖ చేసిన ప్రతిపాదనను బుధవారం కేబినెట్ ఆమోదించింది. ఆ దేశ ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. 


ఇక మంత్రిమండలి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేబినెట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ సులైతి సమావేశంలోని తీసుకున్న పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. కేబినెట్ అర్హతలు, అకడమిక్ అక్రిడేషన్ కోసం జాతీయ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం. ఆయుధాల నిషేధం కోసం జాతీయ కమిటీ ఏర్పాటు చేస్తూ 2004 నాటి నిర్ణయం నం. 26లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ తెచ్చిన ముసాయిదాను కేబినేట్ ఆమోదించింది. దీంతో పాటు క్లౌడ్ కప్యూటింగ్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ పత్రాన్ని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే విద్యుత్ రంగానికి చెందిన అరబ్ కామన్ మార్కెట్ ఫర్ ఎలక్ట్రిసిటీ ముసాయిదాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్లా తెలిపారు. 


Updated Date - 2022-06-02T16:18:39+05:30 IST