ఖతార్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు..!

ABN , First Publish Date - 2022-01-18T22:46:34+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే "పెద్ద పండుగ" "సంక్రాంతిని ఖతార్ దేశంలోని ప్రవాసీయులు కూడా ఘనంగా జరుపుకున్నారు.

ఖతార్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు..!

తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే  "పెద్ద పండుగ" "సంక్రాంతిని ఖతార్ దేశంలోని ప్రవాసీయులు కూడా ఘనంగా జరుపుకున్నారు. "ఆంధ్ర కళా వేదిక" నిర్వహణ కమిటీ నేతృత్వంలో "వెంకప్ప భాగవతుల" అధ్యక్షతన ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. 


ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, మేడమ్ అంబాసిడర్ డాక్టర్ అల్పనా మిట్టల్, ఐసిసి సమన్వయ అధికారి శ్రీ జేవియర్ ధన్ రాజ్, ఇండియన్ కల్చరల్ సెంటర్‌లోని అశోకా హాల్‌లో మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. ఆ తరువాత.. గాలిపటాలను ఎగురవేసి, కార్యక్రమంలో పాల్గొన్న వారికి  అభినందనలను తెలియజేసారు. రంగోలి మేళాలో పోటీలో మొదటి స్థానాన్ని నీరజా రెడ్డి కందుల చేజిక్కించుకోగా.. 2వ స్థానంలో కవితా మురళీ మురుగన్,  3వ స్థానంలో గాయత్రి మొగరాలా నిలిచారు. అనంతరం.. ప్రశంస పత్రాలను, బహుమతులను అందుకున్నారు.   


కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐసిసి అధ్యక్షుడు శ్రీ పిఎన్ బాబురాజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కె. ఎస్. ప్రసాద్, ఐసిబిఎఫ్ అధ్యక్షుడు శ్రీ జియాద్ ఉస్మాన్, రజని మూర్తితో పాటుగా మణికంఠన్, వినోద్ నాయర్, సుబ్రహ్మణ్య హెబ్బగులు, సబిత్ సాహిర్, తదితర ప్రముఖులు, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఆంధ్ర కళా వేదిక కొత్త మేనేజ్ మెంట్ బృందం ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గొబ్బిళ్ళ నాట్యాలు, హరిదాసు, గోదాదేవి అలంకరణలో పిల్లలు పాల్గొనడం,  పిల్లలకి భోగిపళ్లు, కార్యనిర్వాహకవర్గ కుటుంబాలు తయారు చేసిన తెలుగింటి వంటకాలు కార్యక్రమానికి విచ్చేసిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమానికి శిరీషా రామ్, శ్రీసుధ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ప్రారంభ సందేశాన్ని వినిపించగా.. అధ్యక్షులు వెంకప్ప భాగవతుల ఇచ్చిన ముగింపు సందేశంతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.



Updated Date - 2022-01-18T22:46:34+05:30 IST