గురుకులాల్లో గుణాత్మక విద్య

ABN , First Publish Date - 2021-07-30T05:51:29+05:30 IST

గురుకులాల్లో గుణాత్మక విద్య లభిస్తుందని జిల్లా సమన్వయ అధికారి ఎస్‌.రూపావతి చెప్పారు.

గురుకులాల్లో గుణాత్మక విద్య
తాళ్లపాలెంలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న రూపావతి

జిల్లా సమన్వయ అధికారి రూపావతి


కశింకోట, జూలై 29: గురుకులాల్లో గుణాత్మక విద్య లభిస్తుందని జిల్లా సమన్వయ అధికారి ఎస్‌.రూపావతి చెప్పారు. తాళ్లపాలెం బాలయోగి గురుకుల కళాశాలలో గురువారం ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థినులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి తరగతులు నిర్వహించాలని సూచించారు. కాగా ప్రవేశ పరీక్షకు 227 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారని, 176 మంది విద్యార్థినులు హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ ఎం.మాణిక్యం తెలిపారు.

Updated Date - 2021-07-30T05:51:29+05:30 IST