నాణ్యమైన విద్యనందించాలి

ABN , First Publish Date - 2022-08-08T05:58:02+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు పెంచి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

నాణ్యమైన విద్యనందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి 

నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు పెంచి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో యూటీఎఫ్‌ కార్యాలయంలో విద్యారంగంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 75 ఏళ్లలో విద్యారంగంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేదన్నారు. నూతన విద్యావిధానం కాకుండా కొఠారీ విద్యా కమిషన్‌ సిఫారసులు అమలయితే శాస్ర్తీయ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో యూఏటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాల్ల వెంకటేశం, సరళ, శ్రీనివాస్‌, అంజిరెడ్డి, మురళయ్య, నర్సింహ, వెంకన్న, రమాదేవి, అరుణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:58:02+05:30 IST