ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:41:58+05:30 IST

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. బుధవారం బోధనా కార్యక్రమంలో భాగంగా

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
గోకారంలో విద్యార్థినులను ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

బిగ్గరగా పాఠాలు చదివితే జ్ఞాపకశక్తి 

కలెక్టర్‌  పమేలాసత్పథి 

వలిగొండ, జూలై 6: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.  బుధవారం బోధనా కార్యక్రమంలో భాగంగా మండలంలోని గోకారంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీతో కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిగ్గరగా పాఠాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. తప్పులు దొర్లకుండా పదాలు సులభంగా చదవొచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పలువురు విద్యార్థులతో పాఠాలు చదివించి, సంతృప్తి వ్యక్తంచేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లు పాఠశాల సిబ్బంది కృషికి నిదర్శనమన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, సర్పంచ్‌ మాధవి సురేందర్‌, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీడీవో గీతారెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ లింగస్వామి, ఆర్‌ఐ మనోహర్‌, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:41:58+05:30 IST