గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధన

ABN , First Publish Date - 2022-05-16T06:32:34+05:30 IST

తెలంగాణ రాక ముందు ప్రైవేట్‌ పాఠశాలలకు అలవాటు పడ్డారని, ప్రభుత్వ విద్య బలోపేతంతో పాటు నాణ్యమైన విద్యను అందించేలా సీఎం కేసీఆర్‌ గురుకులాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బంగారుగూడ

గురుకులాల్లో నాణ్యమైన విద్యా బోధన
ట్రాక్టర్‌ను నడుపుతున్న జోగు రామన్న

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 15: తెలంగాణ రాక ముందు ప్రైవేట్‌ పాఠశాలలకు అలవాటు పడ్డారని, ప్రభుత్వ విద్య బలోపేతంతో పాటు నాణ్యమైన విద్యను అందించేలా సీఎం కేసీఆర్‌ గురుకులాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బంగారుగూడ ఎంపీపీఎస్‌ పాఠశాలలో మౌలిక వసతుల కోసం రూ.2లక్షల  29 వేలు మంజూరయ్యాయి. దీంతో ఆదివారం ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందాలనే గొప్ప సంకల్పంతో గురుకులాలతో పాటు, సాధారణ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ భోదనను ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, కమిషనర్‌ శైలజ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

దళితులను ఆదుకునేందుకే దళిత బంధు 

అణచివేతకు గురైన దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని, ఆర్థికాభివృద్ధికి పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని కొత్తగూడలో దళితబంధు లబ్ధిదారులకు ఆస్తుల మంజూరు పత్రాలతో పాటు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత గౌతమబుద్దుడు, డాక్టర్‌ బాబాసాహెబ్‌ చిత్రపటాలకు పూజలు చేసి బుద్ద వందనం సమర్పించారు. బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళికలతో ముం దుకు సాగుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. దళితబస్తీ పథకంలో మూడు ఎకరాల భూమితో పాటు ఇప్పుడు వ్యాపారం, స్వయం ఉపాధిలో రాణించేందుకు దళితబంధు పథకం కింద రూ.పది లక్షలను ఇస్తున్నారని పేర్కొన్నారు.  

గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం అందించేలా ఐసీడీఎస్‌ అధికారులు కృషి చేయాలని సొంత భవనాలు లేని గ్రామాల్లో భవనాలను కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని రాములుగూడ, కొత్తగూడ గ్రామాల్లో ఎస్‌డీ ఎఫ్‌ నిధులో అంగన్‌వాడీ భవనాలను నిర్మించారు. కాగా ఆదివారం ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించి భవనాలను ప్రారంభించారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, ఎంపీపీ సెవ్వలక్ష్మి, వైస్‌ ఎంపీపీ రమేష్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-05-16T06:32:34+05:30 IST